
ఈ లవ్ ట్రాక్‌లో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ తమ్ముడు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. గతంలో కూడా రష్మిక, ఆనంద్‌తో చాలా సరదాగా గడిపిన సందర్భాలు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా ఆనంద్ తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రష్మిక చీఫ్ గెస్ట్‌గా వెళ్లి, అక్కడ వీరిద్దరూ చేసిన ఫన్నీ సంభాషణ బాగా వైరల్ అయింది. ఇక తాజాగా మరో విషయం చర్చనీయాంశమైంది. రష్మికను ఆనంద్ సరదాగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట. “విజయ్ తో లవ్ స్టోరీ, మీ సీక్రెట్స్ అన్నీ బయటపెడతా… అంతకంటే ముందు మీరు స్వయంగా మీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పేయండి” అంటూ ఆటపట్టిస్తున్నాడట. “మీరు చెబితే బాగుంటుంది, లేకపోతే నేనే చెబుతాను” అని ఫన్‌గా చెప్పడంతో, సోషల్ మీడియాలో ఈ సరదా బ్లాక్ మెయిల్ న్యూస్ వైరల్ అయి, మీమ్స్, కామెంట్స్ వర్షం కురుస్తున్నాయి.
కొందరు రష్మిక ఫ్యాన్స్ ఆనంద్ ని ట్రోల్ చేస్తున్నారు. "నమ్మక ద్రోహి..నిన్ను నమ్మి అన్ని చెప్పితే ఇలా బ్లాక్ మెయిల్ చేస్తావా..?" అంటూ సరదాగా రియాక్ట్ అవ్తున్నారు. ఇక రష్మిక విషయానికి వస్తే – ఆమె ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ బిజీగా ఉంది. ఒక వైపు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, మరో వైపు కొత్త కాన్సెప్ట్ ప్రాజెక్టులలోనూ తనదైన ప్రత్యేకత చూపిస్తోంది. తాజాగా "మైసా" ప్రాజెక్ట్‌తో మంచి రెస్పాన్స్ పొందింది. ఈ సినిమా పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రాబోయే సినిమాలతో ఇండస్ట్రీలో తన స్థానాన్ని మరింత బలపరచుకోబోతోందని అభిమానులు నమ్ముతున్నారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే – రష్మిక, విజయ్ ఇద్దరూ తమ లవ్ లైఫ్ గురించి ఎప్పుడు ఓపెన్ అవుతారు..? ఎప్పుడు ఫ్యాన్స్‌కి ఆ గుడ్ న్యూస్ ఇస్తారు..? ఈ క్యూట్ జంటపై అందరి దృష్టి ఇదే అంశంపై నిలిచిపోయింది.