దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమా సంగీతాన్ని డిక్టేటర్‌లా పాలించాడు ఇళయరాజా. ఆయన ముట్టుకున్న ప్రతి స్వరం శ్రోతల హృదయాల్లో శాశ్వతంగా మిగిలిపోయింది. ఇప్పటి పాటలు ఒక సంవత్సరం మించి వినిపించవు, కానీ ఇళయరాజా కంపోజ్ చేసిన మెలోడీలు ఎప్పటికీ పాతబడవు. అందుకే నేటి ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల్లో ఎక్కడో ఒక చిన్న పాటైనా ఆయన మ్యూజిక్ రిఫరెన్స్ వాడుతూనే ఉంటారు. అది వారి సినిమా మీద ఓ సాఫ్ట్ ఎమోషనల్ లేయర్ కట్టేస్తుంది. కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్! సంగీతంలో ఎంత మృదువుగా ఉంటారో, హక్కుల విషయంలో మాత్రం అంతే కర్కశంగా మారిపోతారు ఇళయరాజా. చిన్న బిట్ అయినా ఆయన కాపీరైట్‌ను తాకితే చాలు .. కేసుల వర్షం కురుస్తుంది.
 

ఇప్పటిదాకా ఎన్నో నిర్మాతలు, డైరెక్టర్లు ఆయన స్ట్రైక్స్‌తో వణికిపోయారు. పాటలు వింటే ఓకే .. కానీ సినిమాలో పెట్టాలంటే సరైన ఒప్పందం లేకపోతే చుక్కలు చూపిస్తారు రాజా. లేటెస్ట్‌గా ఈ కాపీరైట్ ఖడ్గం నెట్‌ఫ్లిక్స్ మెడ మీద పడింది. అజిత్ హీరోగా వచ్చిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాలో ఇళయరాజా పాటలు వాడటమే పెద్ద సమస్యగా మారింది. వెంటనే లీగల్ నోటీసులు జారీ చేసిన ఇళయరాజా, ఒప్పందం సరిగా లేనందున సినిమా మొత్తాన్ని ప్లాట్‌ఫాం నుంచి తొలగించేలా చేశారు. ఫలితం.. ఆ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కనిపించదు! నిర్మాతలు, ప్లాట్‌ఫాం టీమ్ షాక్‌కి గురయ్యారు.

 

ఇంత మధురమైన స్వరాలను అందించిన ఇళయరాజా, కాపీరైట్ విషయంలో మాత్రం అసలు రాజీ పడరని ఈ ఘటన మళ్లీ నిరూపించింది. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ “ఒక చిన్న బిట్ వేశామంటే ఏమవుతుంది” అనుకుంటారు. కానీ ఇళయరాజా దగ్గర ఆ లాజిక్ పని చేయదు. ఆయన పాటలను అనుమతి లేకుండా వాడటం అంటే కేసుల తుఫాన్‌ను ఆహ్వానించినట్లే. ఇకపై నిర్మాతలు జాగ్రత్త పడక తప్పదు. ఇళయరాజా మ్యూజిక్‌ను యాప్‌లలో ప్రైవేట్‌గా విని ఎంజాయ్ చేయండి.. కానీ సినిమాలో పెట్టాలంటే లీగల్‌గా సరైన క్లియరెన్స్ తీసుకోకపోతే భయంకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: