
అయితే ఎంత పెద్ద విజయాన్ని సాధించినా, ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఎంత వినిపిస్తుందో, నెగిటివ్ కామెంట్స్ కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి. “మిరాయి” హిట్ అవ్వడం తేజ సజ్జా కి ఒక శాపంలా మారింది అని సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్, కామెంట్స్ కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం – ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ లేకపోవడం. ఇప్పటి ట్రెండ్ ప్రకారం యంగ్ హీరోలు ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలంటే కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు సరిపోవు. వాటితో పాటు ఫుల్‌టూ ఫుల్ ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేటి యువత ఎక్కువగా కనెక్ట్ అయ్యేది రొమాంటిక్ ఎమోషన్స్, లవ్ డ్రామాస్ ద్వారానే.
తేజ సజ్జా ఇప్పటివరకు ఎంచుకున్న కథలు ఎక్కువగా మెసేజ్ బేస్డ్ లేదా సోషల్ ఇంపాక్ట్ కలిగినవే. ఈ దారిలోనే కొనసాగితే, నటుడిగా రేంజ్ పెరగొచ్చు కానీ కమర్షియల్ మార్కెట్ మాత్రం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఒక హీరోకి మార్కెట్ బలపడటానికి మాస్ ఆడియెన్స్‌కి తోడుగా యూత్ కనెక్ట్ చాలా అవసరం. అది లేకపోతే భవిష్యత్తులో “భారీ బొక్క” తప్పదని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. సినీ ప్రముఖుల మాటల్లో చెప్పాలంటే – “మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తప్పక చేయాలి, కానీ మధ్యలో లవ్ స్టోరీస్ కూడా మిక్స్ చేస్తూ వెళ్తేనే తేజ సజ్జా కెరీర్ లాంగ్ రన్‌లో నిలుస్తుంది. లేకపోతే మిరాయి లాంటి సూపర్ హిట్స్ కూడా అతని పాలిట ఒక శాపంలా మారిపోతాయి”. మొత్తానికి, “మిరాయి” విజయంతో తేజ సజ్జా పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నా, అదే విజయమే అతనిపై కొత్త ఒత్తిడి, కొత్త అంచనాలు మోపుతోంది. ఇప్పుడు అతను ఎలాంటి కథలు ఎంచుకుంటాడు, కెరీర్ దారిని ఎలా మలుస్తాడు అన్నదే పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.