సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఒక కొత్త తలనొప్పి మొదలైంది. అసలు వాళ్లు ఎప్పుడు, ఎలా, ఏ విధంగా తమ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను రిలీజ్ చేయాలి, ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నది ప్లాన్ చేసుకుంటుంటే, సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మాత్రం తమకిష్టమైన రోజునా, పండుగ సీజన్‌లోనో తప్పనిసరిగా అప్‌డేట్ రావాలని డిమాండ్ చేస్తుంటారు. ఈ ఫ్యాన్ ఎక్సైట్మెంట్ కొన్నిసార్లు ప్రొడక్షన్ హౌస్‌లకు, డైరెక్టర్స్‌కి, హీరోలకు పెద్ద సమస్యగా మారిపోతుంది. అసలు మూవీ టీం ఏమీ చెప్పకపోయినా, ఫ్యాన్స్ లేదా కొన్ని పేజీలు సోషల్ మీడియాలో తాము ఊహించిన అప్‌డేట్స్‌ను వైరల్ చేస్తూ హడావిడి చేస్తారు.


ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమాకి కూడా ఎదురవుతోంది. తార హీరో గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమాకు ప్రతిభావంతుడైన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారం ఈ చిత్రానికి "డ్రాగన్" అనే టైటిల్ ఖరారయ్యిందని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంటర్వ్యూల్లో మాత్రం నటీనటులు, టెక్నికల్ టీం కొన్ని హింట్స్ ఇవ్వడంతో టైటిల్ విషయంపై ఆసక్తి మరింత పెరిగింది.



ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నేని,  ఎలమంచి రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా రుక్మిణి వసంత నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఒక వార్త వైరల్ అయింది. ఈ దసరా కానుకగా, అంటే అక్టోబర్ 2న, ఈ సినిమాకి సంబంధించిన ఓ డ్రీమ్స్ అప్‌డేట్ (గ్లింప్స్) రిలీజ్ అవుతుందంటూ ఒక న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా నందమూరి అభిమానులు, ప్రశాంత్ నీల్ అభిమానులు ఆశ్చర్యపోయారు. "ఇంత త్వరగా సినిమా నుండి గ్లింప్స్ వస్తాయా?" అంటూ ఎక్సైట్మెంట్‌తో షాక్ అయ్యారు.



కానీ వాస్తవానికి ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని సినిమా యూనిట్‌కు దగ్గర ఉన్న వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతలు గానీ, దర్శకుడు గానీ, ఎవరూ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తున్నారు. కావాలనే కొందరు అచ్యుత్సాహంతో ఈ ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారని క్లారిటీ ఇచ్చారు. “ ఏదైనా ఉంటే చిత్రబృందమే అధికారికంగా ప్రకటిస్తుంది” అని క్లియర్‌గా చెబుతున్నారు.



ఇక ఈ ఫేక్ న్యూస్ కారణంగా సోషల్ మీడియాలో అభిమానులు మరింత ఎగ్జైట్ అయ్యి రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ "ఇలాంటి ఫేక్ వార్తలు ఆపండిరా బాబు... మాకు అఫీషియల్ అప్‌డేట్ వచ్చినప్పుడే మేము నమ్ముతాం" అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు "ఎన్టీఆర్ సినిమా అప్‌డేట్ కోసం మేము ఓపికగా వెయిట్ చేస్తాం కానీ ఇలాంటి అబద్ధపు వార్తలు స్ప్రెడ్ చేయడం సరైంది కాదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, రిలీజ్ డేట్—ఏది అయినా బయటకు రావడం అంటే సోషల్ మీడియాలో హవా మామూలుగా ఉండదు. అందుకే అభిమానులు నిజమైన అప్‌డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ, ఫేక్ న్యూస్‌కు బలి కాకుండా, అధికారిక ప్రకటన కోసం ఓపికగా వెయిట్ చేయాలని మూవీ యూనిట్ కోరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: