
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ముందు రోజు రాత్రి ఓజీ ప్రీమియర్లు చూసి సంబరాలు అంబరాన్ని తాకేలా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అభిమానుల గుండెల్లో బాంబు పేలేలా ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ స్పెషల్ నైట్ షోలు ఉండకపోవచ్చు. సెప్టెంబర్ 25 తెల్లవారుజాము ఒంటిగంట లేదా నాలుగు గంటల నుంచి ఓజీ షోలు మొదలు కావచ్చు అంటున్నారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికి సమాచారం వచ్చిందని సమాచారం. టికెట్ల రేట్ల పెంపు సమాచారం జీవోలు వచ్చేదాకా ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రీమియర్ షో ల పై ఎలాంటి సమాచారం ఉండదని అంటున్నారు. అయితే అభిమానులు మాత్రం పక్కాగా ప్రీమియర్లు ఉంటాయన్న నమ్మకంతో రకరకాల ప్లాన్లు వేసుకున్నారు.
ఒకవేళ షోలు పడకపోతే వారికి నిరాశ తప్పదు. ప్రస్తుతం ఓజీ కి సంబంధించి ఏ న్యూస్ అయినా చాలా సెన్షేషన్ గా నిలుస్తోంది. ఓపెనింగ్స్ ద్వారా ఏయే రికార్డులను బ్రేక్ అవుతాయో ఊహకు అందటం లేదు. మొదటిసారి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ? ప్రపంచానికి ఓ జీ సినిమాతో తెలుస్తుందన్న చర్చలు వినిపిస్తున్నాయి. తమన్ పాటలు అంతకంతకు హైప్ పెంచుతున్నాయి. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హైదరాబాద్ వచ్చి మరి ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు