
2022లో విడుదలైన కల్ట్ క్లాసిక్ `సీతారామం` మృణాల్‌కు భారీ స్టార్డమ్‌ను అందించింది. హనూ రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన ఈ సినిమా, ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. సీత పాత్రలో ఆమె నటనకు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండింటిలోనూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే నటిగా కోట్లలో రెమ్యునరేషన్ సంపాదిస్తున్నా.. ఖర్చు పెట్టే విషయంలో మాత్రం మృణాల్ మహా పిసినారి అట.
సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. ముఖ్యంగా వారు రెగ్యులర్‌గా ధరించే దుస్తుల కాస్ట్ తెలిస్తే సామాన్యులకు ఫ్యూజులు అవుట్ అవుతుంటాయి. కానీ మృణాల్ మాత్రం ఖరీదైన దుస్తులు కొనడం అస్సలు ఇష్టం ఉండదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా ఈ విషయం వెల్లడించింది. దుస్తులకు తను ఎక్కువగా ఖర్చు పెట్టనని.. ఎన్ని డబ్బులు పోసి కొన్నప్పటికీ అవి కబోర్డ్స్ లో మూలుగుతాయి తప్ప ఉపయోగపడవని తెలిపింది. అలాగే తాను కొనుగోలు చేసే దుస్తుల ఖరీదు రూ. 2 వేటు దాటి ఉండవని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సినిమా ఈవెంట్స్, ఇతర ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు మాత్రం లక్షలు ఖరీదు చేసే దుస్తులను రెంట్ కు తెచ్చుకుని ధరిస్తానని మృణాల్ పేర్కొంది. ఈ లెక్కన ఖర్చు చేయడంలో మృణాల్ ఎంత పొదుపరో స్పష్టంగా అర్థమవుతోంది.