తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా, జూనియర్ ఎన్టీఆర్‌కి ఉన్న ప్రత్యేక క్రేజ్‌, అభిమానుల ఫాలోయింగ్ మరెవరికీ లేదని చెప్పాలి. ముఖ్యంగా ఆయన నటన, ఆయన చెప్పే డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి.‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని, స్టార్ స్టేటస్‌ను మరింత పెంచుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్‌ను ఇటీవలే పూర్తి చేశారు. జూనియర్ ఎన్టీఆర్సినిమా తర్వాత త్రివిక్రమ్‌–శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. అలాగే ‘దేవర 2’ చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానుల మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన తాజా వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు సమాచారం. ఆయన ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. టెక్నికల్ లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా గాయపడకుండానే తప్పించుకున్నారని, స్వల్ప గాయాలతో బయటపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. జాగ్రత్త చర్యల భాగంగా ఆ యాడ్ నిర్వాహకులు ఆయనను హాస్పిటల్‌లో చెకప్ కోసం అడ్మిట్ చేసి కొన్ని టెస్టులు చేయించారని, ఆయన పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నారని తెలుస్తోంది. అభిమానులు చింతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. “ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారా? గాయాలు పెద్దగా కాలేదా?” అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన కాళ్లకు స్వల్ప గాయం జరిగినట్లు సమాచారం. అంతే తప్ప ఆయనకు పెద్దగా గాయాలు ఏమీ కాలేదు. దీంతో అభిమానులు ఊరట పడ్డారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే దీనిపై  జూనియర్ ఎన్టీఆర్ టీం స్వయంగా స్పందించడం తో ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఆయన స్పందించి ఓ వీడియో లో వివరణ ఇస్తే అభిమానులు మరింత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: