
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “ఓజీ” మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సుజీత్, పవన్ కోసం ప్రత్యేకంగా మాస్ మరియు స్టైలిష్ యాక్షన్ డ్రామా రూపొందించారు. ట్రైలర్, టీజర్‌లలోనే పవన్ కళ్యాణ్ లుక్, డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్‌లు భారీగా అంచనాలు పెంచేశాయి. దీంతో థియేటర్లలో ఎలాంటి హంగామా క్రియేట్ చేస్తుందా అన్నది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందురోజు వరకూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సుజీత్ చాలా కేర్ తీసుకుంటూ పూర్తి చేశారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో థమన్‌తో కలిసి లాస్ట్ మినిట్ వరకు కష్టపడి, ఫైనల్ ఔట్‌పుట్‌కి పూర్తి స్థాయి సంతృప్తి చెందారు. ఈ క్రమంలో సుజీత్, థమన్ ఇద్దరూ చేతులు కలుపుకుంటూ సంతోషంగా ఉన్న ఫోటోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓజీతో బాక్సాఫీస్‌ను తగలబెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.. మీరు సిద్ధమేనా ? అని వీరు చెపుతున్నట్టుగా ఆ పోస్టర్ ఉంది. దీంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రభాస్ శ్రీను వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రతిష్టాత్మకమైన డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందించబడింది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్స్ హంగామా, బుకింగ్స్ రికార్డులు ఈ సినిమా ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో చూపిస్తున్నాయి. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేసిన ఈ సినిమా, విడుదల రోజున బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. ఫైనల్‌గా సుజీత్–థమన్ కాంబినేషన్, పవన్ కళ్యాణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసిపోవడంతో “ఓజీ” బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.