- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “ఓజీ” విడుదల అయ్యింది. ట్రైలర్స్, టీజర్స్ తోనే సినిమాపై అపారమైన హైప్ ఏర్పడింది. పవన్ అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంతగానో ఎదురు చూపులు చూశారు. ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందా అనే ఉత్కంఠ అందరిలోనూ కనబడుతోంది. హిట్ టాక్ రావ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు.
ఇక ఈ సినిమాకు నైజాం ఏరియాలోనే 366 కి పైగా ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఇది నైజాం లో ఆల్ టైమ్ రికార్డు అని మేకర్స్ ప్రకటించారు. ఇంత భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు వేసిన సందర్భం అరుదుగా మాత్రమే జరుగుతుంది. అంతేకాదు, ఈ ప్రీమియర్ షోలు అన్నీ కూడా టికెట్ కౌంటర్ వద్దకు వచ్చిన వెంటనే హౌజ్‌ఫుల్ కావడం పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి నిదర్శనం.


సినిమాపై ఉన్న‌ ఈ క్రేజ్ బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తొలి రోజే నైజాం ఏరియాలోనే రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో వారం రోజుల పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కొత్తగా, స్టైలీష్ లుక్‌లో క‌నిపించాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నాడు. శ్రియా రెడ్డి, ప్రభాస్ శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫైన‌ల్‌గా “ఓజీ” ప్రీమియర్స్‌తోనే రికార్డులు సృష్టించి, ఫస్ట్ డే వసూళ్లలో కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ తుఫాన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: