ఇప్పటికే దేవి నవరాత్రులు మొదలయ్యాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాలలో భక్తులు ఆరాధిస్తారు. ప్రతిరోజు రకరకాల నైవేద్యాలతో కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా భారత దేశంలో ఉండే హిందువుల సైతం నవరాత్రులను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. నవరాత్రుల సమయంలో ఎలాంటి దుస్తులు ధరించాలి? దుర్గాదేవి అనుగ్రహ పూర్తిగా కుటుంబం యొక్క ఆర్థికంగా, ఆనందల పై ఉండాలి అంటే నవరాత్రులలో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇవి లభిస్తుందో కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలు చూద్దాం.

నవరాత్రులలో రత్నాలను కొనుగోలు చేయడం మంచి శుభ ఫలితాన్ని అందిస్తుంది. మీ జాతకం చూపించుకొని అందుకు తగ్గట్టుగా రత్నాన్ని ధరించడం వల్ల అదృష్టం కలిసొస్తుంది.

నవరాత్రులలో ఎవరైనా ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

నవరాత్రులలో కొత్త దేవుడు విగ్రహాలు లేదా చిత్రపటాలను మనం ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో పూజ గదిలో పెట్టడం వల్ల సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది.

మనం ఇంట్లో సాధారణంగా ఉపయోగించి అద్దం, తిలకం, దువ్వెన వంటి వస్తువులను కొనుగోలు చేసి వీటిని అమ్మవారికి సమర్పించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

నవరాత్రులలో బంగారం, వెండి వస్తువులలో ఏది కొన్నా కూడా శుభ ఫలితమే. వీటిని తీసుకువచ్చిన తర్వాత పూజ గదిలో ఆ రోజంతా ఉంచడం వల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


ఈ నవరాత్రులలో ఎవరైనా శని దోషంతో బాధపడుతూ ఉంటే తులసి మొక్క నాటడం చాలా మంచిది. వీటివల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.


అలాగే జమ్మి చెట్టుకి తొమ్మిది రోజులపాటు తొమ్మిది సార్లు ప్రదర్శనలు చేయడం వల్ల శని దోషం పోతుంది.


ఈ నవరాత్రులలో ఇలాంటి వస్తువులు కొనడం వల్ల ఆ ఇంటిల్లిపాది డబ్బుకి ఆనందానికి లోటు లేకుండా రెట్టింపు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: