- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అతి పెద్ద హైప్ క్రియేట్ చేస్తున్న పాన్ ఇండియా అవైటెడ్ సినిమా ‘కాంతార 1’ విడుదలకు సిద్ధమైంది. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగానూ తెరకెక్కించిన ఈ ప్రీక్వెల్ సినిమా అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. అయితే ప్రత్యేకంగా యూఎస్ లో అక్టోబర్ 1న ప్రీమియర్ షోలు ప్లాన్ చేయబడ్డాయి. అక్కడి తెలుగు, కన్నడ, హిందీ ప్రేక్షకులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని థియేటర్లలో సినిమాను చూడటానికి రెడీ అయ్యారు. కానీ చివరి నిమిషంలో వచ్చిన కంటెంట్ డెలివరీ సమస్యలు ఈ షోలను ప్రభావితం చేశాయి. ప్రత్యేకంగా ఐమ్యాక్స్ వెర్షన్‌లో పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఆ వెర్షన్ డెలివరీలో సాంకేతిక సమస్యలు రావడంతో నార్త్ అమెరికా లోని ఐమ్యాక్స్ ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయని అధికారికంగా ప్రకటించారు.

ఈ వార్త విన్న అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా “ఐమ్యాక్స్ అనుభవం కోసం వారం రోజులుగా ఎదురు చూశాం.. కానీ చివరి నిమిషంలో ఇలా జరిగిందా?” అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ స్పష్టంగా చెబుతున్నారు – “ఐమ్యాక్స్ వెర్షన్ లో మాత్రమే జాప్యం ఉంది కానీ సాధారణ వెర్షన్ షోలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి” అని. అంటే యూఎస్ లోని థియేటర్లలో కాంతార 1 సాధారణ వెర్షన్ మామూలుగానే ప్రదర్శించనున్నారు. దీంతో కొంతమంది అభిమానులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఐమ్యాక్స్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసిన వారికి మాత్రం నిరుత్సాహం తప్పలేదు.

గతంలో ‘కాంతార’ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఆ సక్సెస్ వల్లే ఇప్పుడు ప్రీక్వెల్ మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. రిషబ్ శెట్టి యాక్షన్, నేటివిటీ, డివోషన్ కలిపి చూపించే స్క్రీన్ ప్లే పాన్ ఇండియా ఆడియన్స్ లో మరోసారి మంత్ర ముగ్ధులను చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అందుకే అభిమానులు ఈ సినిమా కోసం అంతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇండియా లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కు సర్వం సిద్ధమైంది. ట్రైలర్స్, సాంగ్స్ ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ సృష్టించాయి. ఓపెనింగ్స్ బాగానే ఉంటాయని ట్రేడ్ అంచనాలు. కానీ యూఎస్ లో ఐమ్యాక్స్ ప్రీమియర్ రద్దు మాత్రం సినిమా హంగామాకు చిన్న షాక్ లాంటిది. అయినా సాధారణ వెర్షన్‌తోనే థియేటర్లలో అభిమానులు జోష్ పెంచేస్తారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: