
వంట గదిలో బొద్దింకలు రాకుండా ఉండాలి అంటే.. వండినటువంటి ఆహార ముక్కలను పడకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే సింకుని నిరంతరం శుభ్రం చేస్తూ ఉండాలి. చిన్న చిన్న చెత్త బుట్టలు ఉంటే వాటిని ప్రతిరోజు శుభ్రపరుస్తూ ఉండాలి. నిజానికి బొద్దింకలకు నిరు కూడా చాలా అవసరమే అందుకే నీటి పైపులు ఏవైనా లీక్ అవుతూ ఉంటే వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాంటివి లేకుండా చూసుకోవాలి. వంట గదిలో ఎటువంటి రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.
అలాగే కిరాణా సంచులు లేదా కబోర్డ్ పెట్టెలలో రాకుండా వాసన గుండ్లు వేయడం మంచిది.
బోరిక్ ఆమ్లం కూడా బొద్దింకల పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ బోరిక్ ఆమ్లాన్ని వస్తువుల మీద లేదా బొద్దింకలు వచ్చే చోటు మైదాపిండిలో పిచికారి చేసి చిన్నచిన్న ఉంటలుగా చేసి పెట్టాలి.
బిరియాని ఆకులు, నిమ్మ తొక్కలను బొద్దింకలు ఇష్టపడవు వీటిని వంట గదిలో పెట్టడం వల్ల దరి చేరవు.
అలాగే పిప్పరమెంట్ ఆయిల్ వంటి సుగంధ నూనేను కొంతమేరకు నీటిలో పోసి ఉంచడం వల్ల బొద్దింకలు వంటింట్లోకి రాలేవు.
ఇంటిని తుడిచేటప్పుడు లవంగాల పొడి వేసి తుడచడం వల్ల ఈ వాసనలకు బొద్దింకలు దరి చేరవు.
ఒక గిన్నెలో దాల్చిన చెక్క పొడి, కొంత ఉప్పు వేసి బాగా కలిపి ఆ పొడిని వంట గదిలో అరలలో ఉంచితే బొద్దింకలను తరిమి కొడుతుంది.
బోరాక్స్ పౌడర్, బేకింగ్ సోడా, కొంత చక్కెరను బాగా కలిపి ఆ నీటిని ఒక బాటిల్లో పోసి వంట గదిలో స్ప్రే చేస్తూ ఉండడం వల్ల బొద్దింకల సమస్య తగ్గుతుంది.