ఏంటి అనుపమ ఆ హీరో తో డేటింగ్ లో ఉందా అంటే నిజమే అంటున్నారు కోలీవుడ్ జనాలు. మరి ఇంతకీ అనుపమ ప్రేమలో పడ్డ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అనుపమ రీసెంట్ గా కిష్కింధపురి,పరదా వంటి సినిమాలతో మనల్ని అలరించింది. ఇక త్వరలోనే బైసన్ అనే మూవీతో రాబోతోంది.ఈ సినిమాలో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ధృవ్ విక్రమ్ రెండు సినిమాలు చేసినప్పటికీ ఒకటి రీమేక్ ఫిల్మ్ మరొకటి తన తండ్రితో కలిసి చేయడంతో ఇదే తన ఫస్ట్ మూవీ గా భావించి ప్రేక్షకులు ఆదరించాలి అని ధృవ్ విక్రమ్ రీసెంట్గా సినిమా ఈవెంట్లో చెప్పుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి ధ్రువ్ విక్రమ్ తో అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడిపోయింది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

దానికి కారణం ధృవ్ విక్రమ్ తో కలిసి అనుమ పరమేశ్వరన్ ఈ సినిమాలో ఘాటు  రొమాన్స్ చేయడమే కాకుండా సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్త కోలీవుడ్ లో వినిపించింది. అయితే ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా రీసెంట్ గా బైసన్ మూవీ సాంగ్ ఈవెంట్లో ఓ రిపోర్టర్ మీరు ధృవ్ విక్రమ్ తో డేటింగ్ లో ఉన్నారా అని అనుపమని ప్రశ్నించగా.. దానికి కాదు అని సమాధానం ఇవ్వకుండా.. తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసి టాపిక్ డైవర్ట్ చేసింది. అంతేకాదు ఆ ప్రశ్న అడగడంతోనే అనుపమ ఫేస్లో స్మైల్ కనిపించడంతో చాలామంది నెటిజన్స్ అనుపమ ధృవ్ విక్రమ్ తో ప్రేమలో ఉందని కన్ఫామ్ చేసుకున్నారు.

అలాగే ఈ సాంగ్ ఈవెంట్లో ధృవ్ విక్రమ్ తో సన్నిహితంగా ఉండడం,హగ్ చేసుకోవడం,ప్రేమగా మాట్లాడడం, ఆయన పేరు తీసినప్పుడు నవ్వడం ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ప్రేక్షకులు దగ్గరుండి గమనించారు.దాంతో డౌటే లేదు అనుపమ విక్రమ్ ఇంటికి కోడలుగా వెళ్లడం కన్ఫామ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ చేస్తున్నారు. అయితే తన ప్రేమ పెళ్లి వార్తలపై ఏదైనా రూమర్ వస్తే స్పందించే అనుపమ డైరెక్ట్ గా ప్రశ్న ఎదురైనా కూడా కాదు అని చెప్పకుండా ఆ ప్రశ్నను దాటవేయడంతో వారి మధ్య ఏదో సంథింగ్ ఉంది అని మాట్లాడుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: