
“ఈ సినిమా విషయంలో మా పదేళ్ల ప్రస్థానంలో ఎప్పుడూ జరగని నాలుగు విషయాలు కుదిరాయి” అని ఆయన చెప్పడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. మొదటగా- సబ్జెక్ట్ అదిరిపోయిందని నిర్మాత చెప్పాడు. రెండవది - షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కేవలం 65-70 రోజుల్లోనే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో సినిమా పూర్తి చేశారని తెలిపారు. మూడవది - అనుకున్న బడ్జెట్ లోపే ప్రాజెక్ట్‌ను ముగించారట. నాలుగవది -ఫైనల్ ఔట్‌పుట్ చూసిన తర్వాత తమకు భలే ఎగ్జైట్మెంట్ కలిగిందట. “ఇన్ని సంవత్సరాలుగా ఇంత స్మూత్‌గా కుదిరిన సినిమా మాకు ఇదే మొదటిసారి” అని ఆయన చెప్పడం విశేషం. ఇండస్ట్రీలో చాలా మంది ఈ కామెంట్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. ఎందుకంటే మైత్రీ సంస్థలో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఒకదాంట్లోనూ ఈ నాలుగు అంశాలు పూర్తిగా కుదరలేదని రవిశంకర్ చెప్పడం పరోక్షంగా సుకుమార్ లాంటి డైరెక్టర్లను టార్గెట్ చేసినట్టుగా భావిస్తున్నారు.
‘పుష్ప’, ‘రంగస్థలం’ సినిమాలు ఎంత భారీ విజయాలు సాధించినా షూటింగ్ ఆలస్యాలు, బడ్జెట్ పెరుగుదల మైత్రీకి పెద్ద సవాలు అయ్యాయి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలూ ప్లాన్ ప్రకారం జరగలేదనే కామెంట్లు ఉన్నాయి. అయితే రవిశంకర్ మాటల్లో కౌంటర్ ఉద్దేశం లేకపోయినా… ఆ వ్యాఖ్యలు సుకుమార్, కొరటాల, శివనిర్వాణ వంటి మైత్రీ బ్యానర్‌తో పని చేసిన డైరెక్టర్ల వైపు చూపులు మళ్లించాయి. ఇండస్ట్రీ జనాల మధ్య “ఇది పరోక్షంగా ఒక చిన్న కౌంటర్” అని టాక్ మొదలైంది. ‘డ్యూడ్’ సినిమాపై మైత్రీ టీమ్ ఇంత నమ్మకంగా మాట్లాడటం చూస్తుంటే… ఈ సినిమా మైత్రీ కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ భారీ బడ్జెట్ సినిమాలతో రికార్డులు సృష్టించిన ఈ సంస్థ… ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఒక కాంపాక్ట్ మాస్టర్‌పీస్‌ను అందించబోతోందనే హైప్ ఫుల్ స్వింగ్‌లో ఉంది.