తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరసన్’. ఈ చిత్రాన్ని క్రిటిక్స్‌ ఫేవరేట్ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తుండగా, ప్రధాన పాత్రలో స్టార్ హీరో శింబు (ఎస్‌టీర్) నటిస్తున్నాడు. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వెట్రిమారన్ మార్క్ ఇన్‌టెన్స్ స్టోరీటెల్లింగ్, శింబు నటన, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కలయికతో ‘అరసన్’ చిత్రం ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరగనుంది. ఈ సినిమాను తెలుగులో ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు.
ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో, ఎన్టీఆర్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.


ఒక తమిళ సినిమా కోసం ఎన్టీఆర్ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తింది.  ఎన్టీఆర్‌కి శింబుతో సన్నిహితమైన స్నేహం ఉంది. అదేవిధంగా, వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఒక పాన్‌-ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే టాక్ కూడా కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఆ స్నేహం లేదా భవిష్యత్‌ సహకారం కారణంగానే ఎన్టీఆర్ ఈ సామ్రాజ్యం సినిమాకు వాయిస్‌ ఓవర్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం, వెట్రిమారన్ డైరెక్షన్, శింబు పవర్‌ఫుల్ ప్రెజెన్స్ ... ఈ మూడు కలిసిపోతే సినిమా పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 17న తెలుగు ప్రోమో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వాయిస్‌తో వచ్చే ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: