భారత సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి విజన్‌, ప్రెజెంటేషన్‌, టెక్నికల్ ఎక్సలెన్స్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి ప్రముఖులు అద్భుతంగా నటించిన ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, దాని సీక్వెల్ ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ దేశ వ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది.


ఇప్పుడు ఆ లెజెండరీ ఎపిక్‌ను మరోసారి కొత్త అనుభూతిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఈ కొత్త వెర్షన్‌లో విజువల్ ప్రెజెంటేషన్‌, సౌండ్ క్వాలిటీ, కలర్ గ్రేడింగ్‌ను పూర్తిగా అప్‌డేట్ చేసి, హాలీవుడ్ స్థాయి అనుభూతి ఇవ్వాలని రాజమౌళి ప్రత్యేకంగా శ్రద్ధ వహించారని సమాచారం. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 3 గంటల 44 నిమిషాల రన్‌టైమ్ లాక్ చేయడం విశేషం. అంటే రెండు భాగాలను కలిపినా, కథ ప్రవాహంలో ఎక్కడా విరామం లేకుండా ఒకే ఎపిక్ ఎక్స్‌పీరియన్స్‌గా తీర్చిదిద్దారట‌.


ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి మళ్లీ ఏ స్థాయి మ్యాజిక్ చూపించబోతాడో చూడాలన్న ఆసక్తి పెరుగుతోంది. ఇక ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్నాయి. మేకర్స్ ఈ సినిమాను అక్టోబర్ 31న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. మరోసారి ‘బాహుబలి’ మంత్రం తెరపై అలరించబోతోందని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: