
దీంతో దీపావళి హాలిడేస్ రావడంతో కిరణ్ అబ్బవరం సినిమాకి బాగానే క్రేజ్ పెరిగింది.అయితే ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో నేరుగా థియేటర్లోకి వెళ్లి మరి కిరణ్ అబ్బవరం రచ్చ చేసినట్లు తెలుస్తోంది. ఒక థియేటర్లో నిన్నటి రోజున ఫాన్స్ తో కలిసి స్టెప్పులు వేశారు కిరణ్ అబ్బవరం. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలోని సాంగ్ రాగానే తన డాన్స్ తో ఆకట్టుకుంటూ ఫ్యాన్స్ ని మరింత ఆనందపరిచారు కిరణ్ అబ్బవరం.
థియేటర్లో హీరో డాన్స్ చేయడంతో అటు అభిమానులు కూడా హీరోతో కలిసి ఊర మాస్ స్టెప్పులు వేయడం ఈ వీడియోలో చూడవచ్చు. కే ర్యాంపు సినిమాకి డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహించగా ఇందులో హీరోయిన్ గా ముక్తి తరేజా నటించారు. కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే..మొదటిసారిగా రాజావారు రాణి గారు అనే సినిమాలో నటించినప్పటికీ క,ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో హీరోగా మారి భారీ క్రేజీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సెబాస్టియన్, వినరో భాగ్యం విష్ణు కథ, క, తదితర చిత్రాలలో నటించి భారీ విజయాలను అందుకున్నారు. ప్రస్తుతమైతే చిన్న లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.