తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ సరికొత్తగా అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు హీరో నాని. అయితే ఈసారి డైరెక్టర్ సుజిత్ తో నాని సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దసరా రోజున ప్రారంభం చేయగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో కీలకమైన పాత్రలో మలయాళ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా నటించబోతున్నారు. ప్రముఖ నిర్మాత వెంకట్ బోయపల్లి నిర్మిస్తున్నారు. ఇదంత ఇలా ఉండగా ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఎంపిక చేసినట్లు వినిపిస్తున్నాయి.



మొదట హీరోయిన్  రుక్మిణి వసంత్ పేరు పరిశీలించిన చివరికి పూజా హెగ్డే అని ఫైనల్ చేసినట్లు వినిపిస్తున్నాయి. మొదటిసారి హీరో నాని ,పూజ హెగ్డే జోడితో రాబోతున్న సినిమా కావడం చేత అభిమానులు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపైన ఎలా ఉంటుందో చూడాలనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.పూజ హెగ్డే వరుస ప్లాపులతో సతమతమవుతూ ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యింది.


ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి కాబోతోంది. ఇలాంటి తరుణంలోనే హీరో నాని సినిమాలో ఈమెను తీసుకోబోతున్నారని తెలిసి అభిమానులు పూజ హెగ్డే తిరిగి ఫామ్ లోకి రావడానికి ఇదే సరైన సినిమాగా మారుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి బ్లడీ రొమియో అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. రేపటి రోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదటిలో రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: