ఈ మధ్య కాలంలో అనేక మంది నిర్మాతలు వారు నిర్మించిన సినిమాలను విడుదల తేదీ కంటే ముందే ప్రీమియర్ షో ల పేరుతో పెద్ద ఎత్తున అనేక ప్రాంతాలలో ప్రదర్శిస్తున్నారు. ప్రీమియర్ షో లను ప్రదర్శించడం ద్వారా సినిమాకు మంచి జరిగే అవకాశం ఎంత ఉందో చెడు జరిగే అవకాశం కూడా అంతే ఉంది అని అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక సినిమా విడుదల తేదీ కంటే ముందే ఆ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను ప్రదర్శించినట్లయితే ఆ ప్రీమియర్ షో ల ద్వారా ఆ మూవీ కి మంచి టాక్ వచ్చినట్లయితే మొదటి రోజు నుండి ఆ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు రావడం జరుగుతుంది. అదే సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షో లను ప్రదర్శించిన సందర్భంలో ప్రీమియర్ షో ల ద్వారా ఆ మూవీ కి నెగిటివ్ టాక్ కనుక వచ్చినట్లయితే ఆ సినిమాకు మొదటి రోజు కూడా కలెక్షన్లు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండదు. దానితో సినిమాకు పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా భాను భోగభారపు దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను నవంబర్ 1 వ తేదీన విడుదల చేయగా అక్టోబర్ 31 వ తేదీన సాయంత్రం నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. దానితో చాలా మంది నాగ వంశీ అనవసరంగా ఈ సినిమాకు ప్రీమియర్ షో లను ప్రదర్శించాడు. అలా ప్రదర్శించి ఉండకపోయి ఉంటే ఈ మూవీ కి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చేవి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి మాస్ జాతర సినిమా నెగిటివ్ టాక్ ను కూడా తట్టుకొని నిలబడి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంటుందా  లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt