ఇంతవరకు మేకర్స్ ఏ ప్రమోషన్ యాక్టివిటీని కూడా మొదలుపెట్టకపోవడం ఫ్యాన్స్ కి మరింత కంగారు పెడుతోంది. సాధారణంగా బాలయ్య సినిమాల ప్రమోషన్స్ చాలా అగ్రెసివ్‌గా, ఎనర్జిటిక్‌గా సాగుతాయి. కానీ ఈసారి మాత్రం ఆ స్పీడ్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో “మేకర్స్ ఎక్కడ ఉన్నారు?” “ఈ సైలెన్స్ వెనక ఎలాంటి ప్లాన్ ఉందా?” అనే చర్చలు బాగా నడుస్తున్నాయి. ఇక థమన్ అందిస్తున్న సంగీతంపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో అఖండలో “జై బాలయ్య” సాంగ్ ఎంత పెద్ద కల్ట్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ స్థాయి ఎనర్జీ, ఆ విభిన్నమైన సౌండ్ మరోసారి అందిస్తాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్క ప్రోమో కూడా రాకపోవడంతో థమన్‌పై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు, సినిమా టీమ్ అయితే ఈ సైలెన్స్ వెనక ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్. బోయపాటి ఈసారి కథను మరింత పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారట. దాంతో సినిమా విజువల్స్, మేకింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ హాలీవుడ్ లెవల్‌లో ఉండబోతున్నాయట. అఖండ 2లో బాలయ్యను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో చూపించబోతున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని రిపీట్ చేస్తుందా అన్నది చూడాలి..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి