బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, ఎన్నో విలన్ పాత్రల్లో నటించి మెప్పించిన గుల్షన్ గ్రోవర్ ఓ యువతికి బలవంతంగా ముద్దు పెడుతున్నారు. రింగి రింగుల జుట్టుతో ఇట్టే ఆకర్షించే ఆ అందమైన యువతిని వీరిద్దరూ పోటీ పడుతున్నారు. షారూక్, గుల్షన్‌లు ముద్దుపెట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరా అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. అదేంటీ బాలీవుడ్ నటులు ఇలా చేయడం ఏంటీ అంటూ కోపం వస్తుందా...అయితే వీరిద్దరూ పోటీ పడీ ముద్దు పెట్టుకోవాలనుకుంటున్న ఆ ముద్దు గుమ్మ ఎవరో తెలిస్తే షాక్ తింటారు.
ఇంతకీ అమ్మాయి ఎవరో కాదండీ..అసలు అమ్మాయే కాదు..! బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్. ఆశుతోష్ గోవార్కర్ తీసిన `భాజీ` సినిమాలోనిది ఈ ఫోటో. ఈ సినిమాలో నిందితులను పట్టుకునే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా ఆమిర్ నటించాడు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎంత గొప్ప స్టార్ హీరోలైనా ఒకానొక సమయంలో ఆడవేశం వేయాల్సి వస్తుంది.
బాజీ చిత్రంలో అమీర్ ఖాన్ ఓ పాటలో ఆమిర్ స్త్రీ వేషంలో వస్తాడు...ఆ సమయంలో షారూఖ్, గుల్షన్ ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తారు..అప్పట్లో ఈ ఫోటో సెన్సేషన్ అయ్యింది. తాజాగా ఈ ఫోటోను ముగ్గురు స్టార్ హీరోల అభిమానులూ షేర్ చేసుకుని మురిసిపోతున్నారు.