- బాబు మేనిఫోస్టో ప‌ట్టించుకోని బీజేపీ
- కేవ‌లం ఏపీ అభివృద్ధి క‌న్నా జ‌గ‌న్‌ను దించే కోణంలోనే బాబు ఎత్తులు
- జ‌గ‌న్‌పై మాట‌ల యుద్ధానికి బాబు చెప్పే సంక్షేమానికి లేని పొంత‌న‌

( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

రాష్ట్రంలో 2009 త‌ర్వాత‌.. మ‌హాకూట‌మి ఏర్ప‌డిన‌ట్టుగా ఇప్పుడు మూడు పార్టీలు క‌లిసి.. కూట‌మి క‌ట్టాయి. ల‌క్ష్యం ఒక్క‌టే.. జ‌గన్ ఓట‌మి. గ‌మ్యం ఒక్క‌టే అధికారం ద‌క్కించుకోవ‌డం. అయితే.. ఈ మ‌ధ్యలో ఏర్పడి న కూట‌మి తాలూకు ప‌ర్య‌వ‌సానంలో ర‌గులుతున్న ఆత్మ‌వేద‌న‌లు ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు అనుకున్న ది ఒక్క‌టి కూడా.. జ‌ర‌గ‌డం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశించింది ఒక్కటంటే ఒక్క‌టీ కార్య‌రూపం దాల్చ‌లేదు. నిజానికి కూట‌మికి క‌ర్త‌-క‌ర్మ‌-క్రియ త‌నేనంటూ.. ప‌వ‌న్ చెప్పుకొంటారు.


కానీ, అంత‌ర్గ‌తంగా  చూసుకుంటే.. ఈ కూట‌మి అడుగులు, వేస్తున్న న‌డ‌త‌లు గ‌మ‌నిస్తే.. కూట‌మికి క‌ర్త‌-క‌ర్మ‌-క్రియ జ‌గ‌నే అన్న‌ట్టుగా మారింది. జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపాల‌నే ల‌క్ష్యంగా ఏర్ప‌డిన కూట‌మి.. ఆయన ఎంచుకున్న మార్గంలోనే ప‌య‌నించ‌డం.. ఒక కార‌ణం. ఆయ‌న పెట్టుకున్న మేనిఫెస్టో మార్గంలోనే అడుగులు వేయ‌డం. ఇక‌, చేస్తున్న మాట‌ల యుద్ధానికి-చెబుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ధ్య పొంత‌న లేక‌పోవ‌డం. ఈ క్ర‌మంలో బ‌ద్నాం అవుతోంది.. కూట‌మి నేత‌లే.


నిజానికి ముందస్తు షెడ్యూల్ ప్ర‌కారం.. అదికూడా.. ప‌వ‌న్‌కు బీజేపీ పెద్ద‌లు హామీ ఇచ్చిన ప్ర‌కారం.. మే 1నే ఏపీలో ప్ర‌చారం ప్రారంభం కావాలి. కానీ, ఇది.. 8వ తేదీ వ‌ర‌కు వాయిదాప‌డ‌డంతోపాటు.. రాను రాను కుదించుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే.. కేంద్రం నుంచి వ‌చ్చే నాయ‌కుల ప్ర‌చారం ప్ర‌భావం కానీ.. ప్ర‌మోదం కానీ క‌ల్పించే ప‌రిస్తితి లేదు. అంటే.. ఇది నామ్ కేవాస్తే అన్న‌ట్టుగానే కేంద్రంలోని పెద్ద‌లు ప్ర‌చారం చేయ‌నున్నారు.


పోనీ.. మేనిఫెస్టో అయినా.. మురిపెంగా ఉందా ? అంటే.. సెల్ప్ గోల్ చేసుకునేందుకు ప్ర‌యత్నించ‌డం.. నాడు ఇవే ప‌థ‌కాలు అమ‌లు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంద‌న్న పార్టీలు.. నాయ‌కులు వీటిని అంత‌కు మించి అమ‌లు చేస్తామ‌ని చెప్ప‌డం ద్వారా.. జ‌గ‌న్ అధికారాన్ని లాక్కుని తాము సీటు ఎక్కాల‌నే వ్యూహం త‌ప్ప‌.. ఇత‌మిత్థంగా మ‌రో కోణం అయితే.. క‌నిపించ‌డం లేదు. ఇది కూట‌మికి పెను న‌ష్టం. ఎందుకంటే.. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌పై ఓ వ‌ర్గం లో త‌ప్ప‌.. మెజారిటీ ప్ర‌జ‌ల్లో తేడా కొట్ట‌డ‌క‌పోవ‌డ‌మే కార‌ణం.

మరింత సమాచారం తెలుసుకోండి: