ప్రధాని నరేంద్ర మోదీ మే 8, 9వ తేదీల్లో తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన బుధవారం అంటే మే 8న ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రయల్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం నుంచి ఆయన రోడ్ షో ప్రారంభం కానుంది. ఈ రోడ్డు షో బెంజ్ సర్కిల్ వద్ద ముగుస్తుంది. మోదీ వస్తున్న వేల భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. ఇప్పటికే బీజేపీ నేతలు బీజేపీ కార్యాలయంలో సమీక్ష కూడా నిర్వహించారు. ఇందులో ఏపీ బీజేపీ సమన్వయకర్త పేరాల శేఖర్ కూడా పాల్గొన్నారు.

అయితే ఈ రోడ్డు షో ప్లాన్ చేయడం చాలా వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే విజయవాడ సెంటర్‌లో బీజేపీ పార్టీ అసలు పోటీ చేయడం లేదు. మరి ఇక్కడ నుంచి రోడ్డు షో ప్లాన్ ఎందుకు చేశారు? అనేది అయోమయంగా మారింది. విజయవాడ వెస్ట్ నుంచి మాత్రమే బీజేపీ పోటీ చేస్తోంది. అలాంటప్పుడు బెంజ్ సర్కిల్‌లో రోడ్డు షో ప్రారంభించడం ఒక తెలివి తక్కువ నిర్ణయంగా కనిపిస్తోంది. వన్ టౌన్ నుంచి రోడ్డు షో ప్రారంభిస్తే బాగుండేది. అజిత్ సింగ్ నగర్ నుంచి బయలుదేరి ఫ్లైఓవర్ పైనుంచి ర్యాలీ జరిగినా పార్టీకి ప్రయోజనం ఉండేది. కానీ పోటీ చేయని చోట తిరగడం వల్ల ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది.

గద్దె రామ్మోహన్ బోండా ఉమా పోటీ చేస్తున్న ప్రాంతంలో బీజేపీ అధినేత మోదీ ర్యాలీ చేయనున్నారు. మరి ఇలా చేయడం వల్ల బీజేపీ పార్టీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో దానిని ప్లాన్ చేసిన వారికే తెలియాలి. మోదీ ఈ విషయం గురించి తెలుసుకుంటే ఆయన కూడా కంగు తినే అవకాశం ఉంది. ఇకపోతే తెలంగాణలో ఆయన ఎప్పుడు తిరుగుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది షెడ్యూల్ మాత్రం ఎనిమిది తొమ్మిదో తారీఖులలో ఉన్నట్లు చెబుతున్నారు. మే 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మోదీ ఈసారి పోల్చుకుంటే 100 సీట్లను కోల్పోయే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: