ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  తెలంగాణ రాజకీయాల వాడి వేడిగా మారిపోయాయి. అయితే సరికొత్తగా ఆస్త్రాలను సంధించడమె లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయ్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తెగ వాడేస్తున్నారు. సాధారణంగా అయితే ప్రత్యర్థి  పార్టీలు చేసిన తప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియా ఒక మంచి వేదికగా మారిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం లేని విషయాలను ఉన్నట్లుగా పుట్టించి.. మరి ఇక ఇంటర్నెట్లో తప్పుడు ప్రచారం చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి ఫేక్ న్యూస్ లు వైరల్ గా చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఫేక్ న్యూస్ ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తూ ఏకంగా రాజకీయ పార్టీలలోని నేతలందరూ కూడా ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడానికి చేస్తున్న రాజకీయం.. ఇక తెలంగాణలో కేసులు అరెస్టుల వరకు వెళ్ళింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమిత్ షా వీడియోని సోషల్ మీడియాలో ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేసింది అని ఢిల్లీలో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని విచారణకు హాజరు కావాలి అంటూ ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. అయితే తనకు నాలుగు వారాల సమయం కావాలని ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.


 ఇక ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తమపై ఫేక్ పోస్టులతో పోస్టులతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటు బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ ను అరెస్టు చేశారు. ఉస్మానియా హాస్టల్స్ లో నీరు కరెంట్ లేదని సెలవులు ఇస్తున్నట్లుగా వార్డెన్ చెప్పినట్లు ఒక వీడియో వైరల్ అయ్యింది. అయితే దానిని క్రిషంక్  పోస్ట్ చేశారు. అయితే అది ఫేక్ అని హాస్టల్ వార్డెన్ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సర్క్యులర్ పై దుమారం రేగింది.  రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా ఒకవైపు రేవంత్ కు ఢిల్లీ నుండి నోటీసులు వచ్చిన దుమారం కొనసాగుతుండగానే.. క్రిశాంక్ ను చౌటుప్పల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇలా సోషల్ మీడియా స్వేచ్ఛను రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఇక తెలంగాణ రాజకీయాల మొత్తం ఇలా ఫేక్ న్యూస్ కేసుల చుట్టే తిరుగుతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cm