ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ గురించే చర్చ జరుగుతుంది. ఐపీఎల్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతూ ప్రేక్షకులు అందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ పంచుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన కొన్ని టీమ్స్ నిరాశ పరుస్తూ ఉంటే.. అంచనాల లేకుండా ఏడాది ఐపీఎల్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన టీమ్స్ మాత్రం అదరగొడుతున్నాయ్. ఇలా అంచనాలకు మించి రాణిస్తున్న టీమ్స్ లో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.


 ఒకప్పుడు కేవలం బౌలింగ్ విభాగంతో మాత్రమే అటు హైదరాబాద్ జట్టు ఐపిఎల్ మ్యాచ్లలో నెట్టుకుంటూ వచ్చేది. ఈ క్రమంలోనే ఎక్కువ మటుకు అటు పరాజయాల పాలు అవుతూ ఉండేది. కానీ ఈసారి బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లో కూడా అద్భుతంగా రానిస్తుంది. ఏకంగా మహా మహా టీమ్స్ కి సైతం సాధ్యం కాని రీతిలో బ్యాటింగ్ విధ్వంశాన్ని సృష్టిస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ క్రమంలోనే ఆ జట్టు దూకుడు చూస్తుంటే ఈసారి తప్పకుండా విజయం సాధించేలాగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఐపీఎల్ టైటిల్ గెలవడంపై సన్రైజర్స్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కప్పు గెలవడం మేము చూస్తామా అంటూ యాంకర్ వేసిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. కచ్చితంగా సన్రైజర్స్ కప్పు గెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు ప్యాట్ కమిన్స్. ఈ సీజన్లో సన్రైజర్స్ ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి ఐదు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. అయితే అప్పుడప్పుడు వార్నర్ కెప్టెన్సీలో సన్రైజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది అని చెప్పాలి. కానీ ఈసారి మాత్రం తప్పకుండా టైటిల్ గెలుస్తుందని అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl