ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతల భవిష్యత్తును డిసైడ్ చేసే ఎన్నికలుమరో పది రోజుల్లో జరగనున్నాయి. ఇప్పటికేరాజకీయ నాయకుల ప్రచారం తీవ్రస్థాయికి చేరింది.కూటమిలో భాగంగా బరిలో ఉన్న ముఖ్య నేతల నియోజకవర్గాలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్  ఆసక్తిని రేకెత్తిస్తుంది.ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ ఆ నలుగురి నియోజకవర్గాలపై పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగించినట్లు తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం బాధ్యతను మరియు మంగళగిరి నుంచి బరిలో ఉన్న లోకేష్ పై గెలుపు కోసం అక్కడ బాధ్యతలు ఆర్కేకి ఇచ్చినట్లుతెలుస్తుంది. టిడిపికి కంచుకోటగా ఉన్న హిందూపురం, అలాగే కుప్పం నియోజకవర్గంలో వైసిపి గెలుపు అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఒక పెద్దసవాల్ గా మారిందని చెప్పాలి.

అలాగే పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నుండి వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉంది. ఈ సారి గెలుపు అనేది పవన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది.అక్కడ వైసీపీ సైలెంట్ ఆపరేషన్ కొనసాగిస్తుందని తెలుస్తుంది. అయితే సామాజిక సమీకరణాలను పక్కగా అమలు చేసేలా  ప్రణాళికలు సిద్దం చేయిస్తున్నారు. మంగళగిరి నుండి లోకేష్ పోటీ చేస్తున్నారు. అక్కడ స్థానికత మరియు బీసీ సీటు నినాదంతో పాటుగా స్థానికంగా సామాజిక లెక్కల ఆధారంగా వైసీపీ ముందుకు వెళ్తోంది. అయితే మంగళగిరి, పిఠాపురంలో ప్రచారం ముగింపు చివరి రెండు రోజుల్లో జగన్ సభలు ఉండేలా ఆర్కే అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి జగన్ పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.ఇంకా కుప్పం విషయానికి వస్తే మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గం కంటే కుప్పం పైనే ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు.అక్కడ వైసీపీ భరత్ బరిలోకి దించింది.అదే విధంగా హిందూపురం నుంచి బాలయ్య మీద దీపికను బరిలోకి దింపారు. ఈ నెల 4న హిందూపురంలో జగన్ రోడ్ షో కోసం ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఏదేమైన ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ జండా ఎగరవెయాలని తీవ్రంగా కష్టపడుతుంది.అయితే రిజల్ట్ తెలివుంటుందో జూన్ నాలుగు దాక వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: