మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగబోతున్నారు. ఈయన ఇక్కడి నుండి పోటీ చేస్తూ ఉండడంతో ఇప్పటికే అనేక మంది జబర్దస్త్ కమెడియన్లు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా పిఠాపురంలో చాలా రోజులుగా ప్రచారాలను చేస్తూ వస్తున్నారు. ఇక నామినేషన్ల పర్వం ముగిసి ఎలక్షన్లు దగ్గరకి రావడంతో పవన్ కళ్యాణ్ కు అతి దగ్గర వ్యక్తులు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ లు కూడా రంగంలోకి దిగారు. వారు కూడా ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అని తమ వంతు ప్రచారాలను చేశారు.

ఎంతమంది ఏమి చేసినా మెగా ఫ్యామిలీ అంటే ఫస్ట్ గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆయన వచ్చి ప్రచారాలను చేసినట్లు అయితే పవన్ కి వీరందరి కంటే ఎక్కువ క్రేజ్ వస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. ఆయన ఇప్పటికీ చిరంజీవి మాత్రం పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా పవన్ కి ఓటు వేయండి అని ఎక్కడా చెప్పడం లేదు. అలాగే పవన్ రాజకీయాల్లో ఎదగడం అంటే తనకు ఇష్టమేనని , కాకపోతే రాజకీయాల్లో విమర్శలను ఎదుర్కొనే ఇష్టం తనకు లేదు అని అందుకే రాజకీయాల నుండి బయటకు వచ్చాను మళ్లీ రాజకీయ విషయాల్లో తల దూర్చును అని చిరంజీవి పలుమార్లు చెప్పాడు.

దానితోనే అర్థం అవుతుంది చిరంజీవి రాజకీయ విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడు అని. ఇకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు పోటీగా వైసీపీ నుండి వంగ గీత పోటీ చేస్తుంది. దీనితో ఈమె నేను చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి గెలుపొంది మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యాను. పవన్ కళ్యాణ్ తనకు తోడబుట్టిన తమ్ముడు అయితే నేను చెల్లెలు లాంటి దాన్ని అని చెప్తూ వస్తుంది. ఇక దీనితో పిఠాపురం నుండి చిరు కనక పవన్ కి సపోర్ట్ చేసినట్లు అయితే తన పార్టీ ద్వారా ఎమ్మెల్యే అయినా వంద గీత చిరును అన్నల భావిస్తుంది. ఇక చిరు పవన్ కి సపోర్ట్ చేసినట్లు అయితే వంగ గీతకు అన్యాయం చేసినట్లే అవుతుంది కదా అని పలువురు అంటున్నారు. మరి చిరంజీవి లాస్ట్ మినిట్ లో రంగంలోకి దిగి పవన్ కి సపోర్ట్ చేస్తాడా..? లేక అలాగే సైలెంట్ గా ఉంటాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: