తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సత్యదేవ్ ఒకరు. ఈయన తాజాగా కృష్ణమ్మ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి , కొరటాల శివ , అనిల్ రావిపూడి , గోపీచంద్ మలినేని , సుకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఇక ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా యాంకర్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకులను మీకు ఇండస్ట్రీ లో ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి అని అన్నారు. దీనితో రాజమౌళి గారికి మైక్ ఇవ్వగానే అక్కడ ఉన్న జనాలు అంతా జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్రెండ్ అని చెప్పండి ... ఫ్రెండ్ అని చెప్పండి అంటూ గట్టిగా అరిచారు. దీనితో రాజమౌళి నాకు ఎన్టీఆర్ ఫ్రెండ్ కాదు ఒక తమ్ముడు లాంటివాడు అని చెప్పుకొచ్చాడు.

ఇక ఆ తర్వాత రాజమౌళి ఇండస్ట్రీ లో నాకు నిర్మాతలు అయినటువంటి సాయి కొర్రపాటి , శోభు యార్లగడ్డ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ఇక కృష్ణమ్మ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి , ఎన్టీఆర్ నాకు తమ్ముడు లాంటివాడు అని చెప్పడంతో అందుకు సంబంధించిన వీడియోను ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కృష్ణమ్మ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ని దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: