ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సంచలనాలకు నిలయమైంది. ఇటీవలికాలంలో సమాజంపై తీవ్ర ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదని చెప్పవచ్చు.తాజాగా పుష్ప2 నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ అయ్యి రచ్చ రచ్చ చేస్తోంది. అయితే ఈ సాంగ్ లో ఓ పాయింట్ ను మీరు గమనించారా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..జనసేనను సపోర్ట్ చేస్తూ.ఈ సాంగ్ లో ప్రాచారం చేశాడు బన్నీ.. గాజు గ్లాస్ తో రచ్చచేశాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రమోష్ చేసిపెట్టాడు.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. అది కూడా ఆయన నటిస్తోన్న తాజా మూవీ పుష్ప2 తో ప్రమోట్ చేశాడు. బన్నీ హీరోగా నటిస్తున్న పుష్ప2 నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. పుష్ప పుష్ప అంటూ సాగే పాటని తాజాగా ఆ పుష్ప రాజ్‌ క్యారెక్టర్‌.. యాటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు.

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నాడు. ఇక పవర్ స్టార్.. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఇప్పటికే పవన్ తో పాటు అయిన తరపున ఎంతో మంది అభ్యర్థులు నిలబడి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పుష్పరాజ్ సాంగ్ తో బన్నీ కూడా గాజు గ్లాస్ కు గట్టిగా సపోర్ట్ చేశాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాంగ్లో గాజు గ్లాస్ టీ తో రచ్చ రచ్చ చేశాడు అల్లు అర్జున్. గాజు గ్లాసు క్లోజ్ షాట్స్‌తో చాలా సేపు చూపించారు. బన్నీ కూడా తన మేనరిజం తో గాజు గ్లాస్ తీసుకొని అందులో టీ తాగుతూ బిస్కెట్ తింటూ కనిపించాడు. అయితే ఈ సాంగ్ లో గాజు గ్లాస్ షాట్స్ బాగా క్లోజ్ చేసి ఎక్కువగా వాడారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ నమ్మినట్టుగానే ‘పుష్ప 2’లోని మొదటి పాట అయిన ‘పుష్ప పుష్ప’ కాస్త పరవాలేదని ప్రేక్షకులు ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. మొత్తం పాట విడుదలయిన తర్వాత మెల్లగా ఇది అందరికీ ఎక్కేసేలా ఉందని పాజిటివ్గా మాట్లాడడం ప్రారంభించారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం.. ఏ రేంజ్లో ఉంటుందో ‘పుష్ప 2’ టీజర్లోనే అర్థమయ్యింది. ఇక పాటల విషయంలో కూడా డీఎస్పీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడని సాంగ్ చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్కు కొన్నాళ్ల పాటు ఫీస్ట్ ఇవ్వడం కోసం ‘పుష్ప పుష్ప’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.


 ఆగస్ట్ 15న ‘పుష్ప ది రూల్’ కోసం సంబరాలు ఏ రేంజ్లో ఉంటాయో ఇప్పుడే అర్థమయిపోతోంది.అలాగే ఈ గాజు గ్లాస్ షార్ట్స్ అయిన వెంటనే బన్ని తగ్గేదేలే అంటూ పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్పాడు. దీంతో పవర్ స్టార్ కు తన ఫుల్ సపోర్ట్ను బన్నీ ఇచ్చాడు అంటూ.. ఎన్నికల ప్రచారం కోసమే ఆ సీన్స్ ను అంత హైలెట్ చేశారంటూ ఎన్నికల్లో చిన్న మామ తగ్గేదేలే అంటూ సింబాలిక్‌గా బన్నీ చూపించాడంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పవర్ స్టార్ తరుపున ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే వైష్ణవి తేజ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. త్వరలోనే మెగాస్టార్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతాడు అంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బన్నీ చిన్న మామకు పరోక్షంగా పాటతో ప్రచారం చేశాడంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.కాని కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు అల్లు అర్జున్. తాజాగా జనసేనకు ఎలక్షన్స్ ప్రాచారం కూడా ఇలా చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డైరెక్ట్ గా పవర్ స్టార్ తరపున ప్రాచారం చేశారు. ఇక త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా జనసేన తరపున ప్రచారానికి రెడీ అవుతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: