ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల హడావిడి చూస్తూ ఉంటే కార్యకర్తలకు నేతలకు సైతం మంచి ఊపునిచ్చేలా కనిపిస్తోంది.. ఇప్పటి వరకు కేవలం టిడిపి, వైసిపి, జనసేన పార్టీ నేతలు అధినేతలు సైతం ఎక్కువగా ప్రచారంలో పాల్గొన్నారు.ఇప్పుడు తాజాగా ప్రధాన మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనబోతున్నారు.ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ని కూడా ఇటీవలే విడుదల చేశారు.. ఈనెల 7, 8వ తేదీలలో రోడ్డు షోలు ,సభలు నిర్వహించబోతున్నట్లు సమాచారం.


రాజమహేంద్రరావువరం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి అయిన  పురందేశ్వరి మద్దతుగా 7వ తేదీ సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు వేమగిరి సభలో మోడీ మాట్లాడబోతున్నారు.. అలాగే సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు అనకాపల్లి పరిధిలోని రాజుపూలెం సభ లో పాల్గొనబోతున్నారు.. ఇక ఆ మరుసటి రోజు 8వ తారీఖున సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో మాట్లాడబోతున్నారు. రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరా గాంధీ స్టేడియంలో బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన రోడ్డు షోలో పాల్గొనబోతున్నారు నరేంద్ర మోడీ..


ఈ మేరకు ప్రధాన మోడీ పర్యటన షెడ్యూల్ సైతం కార్యక్రమాలను బిజెపి ఇటీవలే విడుదల చేసింది. వాస్తవానికి ఈనెల మూడవ తేదీ నాలుగవ తేదీలలోనే నరేంద్ర మోడీ ప్రచారం చేయవలసి ఉండగా కొన్ని కారణాల చేత మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.. టిడిపి ,బిజెపి, జనసేన పార్టీల మధ్య కూడా పొత్తు కుదిరిన తర్వాత మొదటిసారి ప్రధాని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సభలో పాల్గొన్నారు.. మరి నరేంద్ర మోడీ ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికలు మరింత ఊపొందుకుంటుందని కూటమి భావిస్తోంది.. ప్రస్తుతం పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో పార్టీల సైతం శరవేగంగా ప్రచారంలో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. మరి ఈ దెబ్బతోనైనా కూటమికి మరింత కలిసి వస్తుందేమో చూడాలి మరి. ఈసారి బిజెపి ఓటింగ్ మరింత పెంచుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: