బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిమనులు అయినటువంటి టబు , కరీనా కపూర్ , కృతి సనన్ ప్రధాన పాత్రల్లో "క్రూ" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా పరవాలేదు అనే స్థాయి కలెక్షన్ లు దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టి సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సినిమాలు మే 24 వ తేదీ నుండి ఈ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి  ఇకపోతే ఈ మూవీ లో టబు , కరీనా కపూర్ , కృతి సనన్ తమ నటనతో మాత్రమే కాకుండా , అందాలతో కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకున్నారు. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ టబు కూడా తన అందాలతో ప్రేక్షకులను ఈ సినిమా ద్వారా కట్టిపడేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kru