జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కు సంబంధించిన భారత జట్టు ప్రకటన తర్వాత ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే రింకు సింగ్ గురించి. గత ఏడాది ఐపీఎల్ నుంచి అద్భుతమైన ఫాం కొనసాగిస్తూ అదిరిపోయే ప్రదర్శనలు చేస్తూ వస్తున్న రింకు సింగ్ కు ఎందుకు చోటు దక్కలేదు. సెలెక్టర్లు అతని విషయంలో ఏకంగా వివక్షపూరితంగా వ్యవహరించారు అంటూ అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.


 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన ప్లేయర్లతో పోల్చి చూస్తే అటు రింకు సింగ్ ఐపీఎల్లో అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నప్పటికీ అతని పక్కన పెట్టడంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రింగు సింగ్ ని ఏకంగా బలి పశువును చేశారు అంటూ కొంతమంది మాజీలు ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే ఇలా రింకు సింగ్ ను ఎందుకు భారత జట్టులోకి సెలెక్ట్ చేయలేకపోయాము అనే విషయంపై టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 దురదృష్టవశాత్తు టి20 వరల్డ్ కప్ కు రింకూ సింగ్ ను ఎంపిక చేయలేకపోయామని అజిత్ అగర్కర్ చెప్పుకొచ్చాడు. జట్టులో ఎక్స్ ట్రా బౌలర్ అవసరం ఉండడంతోనే రింకు సింగ్ కి చోటు దక్కలేదు అంటూ అజిత్ అగర్కర్ చెప్పుకొచ్చాడు. కానీ టి20 వరల్డ్ కప్ కు అతడిని సెలెక్ట్ చేయకపోవడంతో రింకు ఫ్యాన్స్ అందరు కూడా తీవ్రంగానిరాశకు గురి అయ్యారు  ఐపీఎల్ తో పాటు గత టి20 మ్యాచ్లలో కూడా అద్భుతంగా రాయించిన అతన్ని పక్కన పెట్టడం ఇక భారత జట్టుకు ఎంతో మైనస్ గా మారుతుంది అంటూ మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండగా రింకు సింగ్ పై సెలెక్టర్లు ఇలా వివక్ష చూపడం నిజంగా అన్యాయం అంటూ అటు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: