ప్రస్తుతం ఐపీఎల్ లోని ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఏ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై మాత్రం ఉత్కంఠ నెలకొంటుంది. చివరి వరకు కూడా ఎంతో రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్లో ఇక భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇరు జట్లు కూడా భారీ స్కోర్ నమోదు చేస్తూ గెలుపు కోసం వీరోచితమైన పోరాటం చేస్తున్నాయ్. దీంతో ప్రతి మ్యాచ్ లో కూడా అనూహ్యమైన ఫలితాలు వస్తూ ఉండడం గమనార్హం.


 అయితే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ప్రేక్షకులు ఊహించని ఫలితం వచ్చింది. ఈసారి ఋతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్లే ఆఫ్ లో అడుగు పెట్టేలాగే కనిపిస్తూ ఉంది అని చెప్పాలి.  ఇటీవల పంజాబీ కింగ్స్ జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తప్పకుండా భారీ విజయాన్ని సాధిస్తుంది అని అభిమానులు అందరూ కూడా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా బ్యాటింగ్ విభాగం విఫలం కావడంతో.. ఇక పంజాబ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. చెన్నై తమ ముందు ఉంచిన టార్గెట్ ను అతి తక్కువ సమయంలోనే చేదించి రికార్డు క్రియేట్ చేసింది పంజాబ్ జట్టు.



 ఇక ఈ విజయంతో ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది అని చెప్పాలి. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని వరుసగా 5 సార్లు ఓడించింది పంజాబ్ కింగ్స్ జట్టు. దీంతో ముంబై తర్వాత ఈ ఫీట్ సాధించిన జట్టుగా నిలిచింది. మరోవైపు చపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా కూడా ముంబై తర్వాత స్థానంలో పంజాబ్ కింగ్స్ నిలిచింది అని చెప్పాలి. ఇప్పటివరకు ముంబై ఐదు సార్లు చపాక్ స్టేడియంలో చెన్నైని ఓడించగా.. పంజాబ్ ఇప్పటివరకు చెన్నై పై చపాక్ స్టేడియంలో నాలుగు సార్లు విజేతగా నిలిచింది. కాగా చెన్నైలోనే చపాక్ స్టేడియం అటు సీఎస్కేకి హోమ్ గ్రౌండ్ గా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: