వైయస్ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ లోని పిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి చురుకుగా ఆంధ్రా ఎన్నికలలో పాల్గొంటుంది. తమ అభ్యర్థుల లిస్టును కూడా విడుదల చేస్తూ ప్రజలతో మమేకం అయ్యేందుకు పలు రకాల యాత్రలు కూడా చేస్తోంది షర్మిల. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండేటువంటి పాడేరు నియోజవర్గ అసెంబ్లీ సీటు విషయంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వంతల సుబ్బారావు తో షర్మిల మాట్లాడిన మాటలకు సంబంధించి ఆడియో లీక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.



అయితే ఈ ఆడియో లీక్ లో కేవలం వైసీపీ పార్టీ ఓటు బ్యాంకు ని దెబ్బ తీయడమే తను లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. పాడేరు కాంగ్రెస్ టికెట్ ని మొదట వంతల సుబ్బారావుకు ఇవ్వడం జరిగింది షర్మిల.అయితే వైసీపీ నుంచి వచ్చిన బుల్లి బాబుకు కూడా ఈ టికెట్ ఇస్తానని చెప్పింది. అలా వంతల సుబ్బారావుకి కాకుండా బుల్లి బాబుకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అలిగిన సుబ్బారావుని బుజ్జగించడానికి షర్మిల ఫోన్ చేసి మరి మాట్లాడినట్లుగా సమాచారం.. ఈ ఆడియో లీఫ్ లో తన సొంత అన్నగా మిమ్మల్ని భావిస్తున్నానని మీరు విత్డ్రా అవ్వండి అంటూ ఆమె తెలియజేస్తోంది..



అంతేకాకుండా బుల్లి బాబు వైసీపీ నుంచి వచ్చారు కానీ ఆయన రాక వైసిపి ఓట్లు కూడా తమకు కలిసి వస్తాయని వైసిపి ఓట్లతో చీలిక వస్తుంది అంటూ షర్మిల ఆడియోలో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.. కానీ వంతల సుబ్బారావు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా మాట్లాడుతున్నట్లుగా ఆడియోలో వినిపిస్తోంది.. ఒకవేళ మీరు కాంగ్రెస్ నుంచి రెబల్గా పోటీ చేస్తే పార్టీ నుంచి దూరమవుతారు అంటూ కూడా షర్మిల బెదిరిస్తోంది.. దీంతో ఆయన తనకు జరగాల్సిన నష్టం జరిగిందని నేను ఈ సమయంలో విత్డ్రా చేసుకోను ఆన్నట్లుగా సుబ్బారావు వెల్లడించారు.. మొత్తం మీద చూస్తే షర్మిల వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుందని అలాగే వైసిపి నేతలని టార్గెట్ చేస్తున్నట్లుగా.. వైసిపి ఓటు బ్యాంకు పైన దెబ్బ కొట్టడానికి చేస్తున్నట్లుగా  ఈ ఆడియోలో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: