సాధారణంగా టి20 ఫార్మాట్లో బ్యాట్స్ మెన్ లదే ఆధిపత్యం కొనసాగుతుంది అని విశ్లేషకులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయాలి అనే టార్గెట్ ఆటగాళ్లపై ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ప్రతి ఆటగాడు కూడా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉండడం చూస్తూ ఉంటాం. అయితే ఐపీఎల్ లో కూడా ఇలాంటి బ్యాటింగ్ విధ్వంసం ప్రతి సీజన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ మాత్రం మరింత స్పెషల్.


 బ్యాటింగ్ విధ్వంసం అనే పదానికి ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా అద్భుతమైన ఆట తీరుతో అటు ఆటగాళ్లు విధ్వంసం సృష్టిస్తున్న తీరు అభిమానులు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రతి మ్యాచ్ లో కూడా 200 కు పైగా పరుగులను ఎంతో అలవోకగా కొట్టేస్తున్నారు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే టాప్ స్కోరర్ గా ఉండేందుకు తెగ పోటీ పడుతున్నారు అని చెప్పాలి. ఆర్సిబి జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. జట్టు గెలుపు ఓటమితో సంబంధం లేకుండా బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు.



 ఈ క్రమంలోనే మొన్నటి వరకు విరాట్ కోహ్లీ ఐపిఎల్ సీజన్లో టాప్ స్కోరర్ గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విరాట్ కోహ్లీని దాటేశాడు. ఏకంగా రుతురాజ్ 59 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడుగా అవతరించాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 62 పరుగులతో రాణించిన ఋతురాజ్ 500 పరుగులతో మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వచ్చాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: