తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో టిఆరెస్ పార్టీకి ఘన విజయం లభించిన తరువాత తమ దృష్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పై ఉంటుంది అన్న విషయాన్ని స్వయంగా కేటిఆర్ ఒక మీడియా సమావేశంలో చెప్పారు. అయితే అలాంటి ప్రముఖ వ్యక్తి మైండ్ ను కూడ బ్లాంక్ చేసే విధంగా నిన్న పవన్ వీరాభిమానులు నిన్న రాత్రి జరిగిన ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తమకు పవన్ పై భక్తిని ప్రదర్శిస్తూ అత్యుత్సాహన్ని ప్రదర్శించారు.
అభిమానులపై మీమాంస ఉండేది
నిన్న జరిగిన ఈవెంట్ లో పవన్ ‘జనసేన’ జెండాలు ప్లకార్డ్ లు విపరీతంగా కనిపించాయి. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ మీట్ లో మాట్లాడుతున్న ప్రతి సెలెబ్రెటీ స్పీచ్ కి అడ్డు తగులుతూ వారందరి చేత కూడ పవన్ నామస్మరణ చేయించేలా చేసారు. ముఖ్యంగా నిన్నటి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ను కూడ పవన్ అభిమానులు బాగా ఇబ్బంది పెట్టారు.
కేటీఆర్ డేరింగ్, డైనమిక్, డాషింగ్
పవన్ వీరాభిమానుల ఆవేశం ఏస్థాయిలో ఉంటుందో తెలిసిన కేటిఆర్ర్ ఒక దశలో నవ్వుతూ  'ఆగండ్రా బాబూ' అని కేటీఆర్‌ పవన్ అభిమానులను బుజ్జగించే ప్రయత్నం చేసి తన అసహానాన్ని బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. పవన్‌ సినిమాల్లోనూ కొనసాగాలనీ రాజకీయాల్లోనూ రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పి కేటీఆర్‌ పవన్‌ అభిమానులఆవేశాన్ని చల్లార్చారు.
సముద్రమంతా అభిమానంతో
ఇది అంతా పవన్ అభిమానులకు చూడటానికి బాగానే ఉన్నా కార్యక్రమానికి వచ్చిన అతిధుల చేత బలవంతంగా పవన్ ‘జనసేన’ కు జై కొట్టించడం ఏమిటి అంటూ ఆకార్యక్రమానికి వచ్చిన అనేక మంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. ముఖ్యమంత్రిగా తమ అభిమాన హీరోను చూడాలని కలలు కంటున్నా పవన్ అభిమానుల అభిప్రాయాన్ని అందరికీ ఆపాదిస్తూ అనేక సందర్భాలలో పవన్ వీరాభిమానులు చూపిస్తున్న ఈ అత్యుత్సాహం ఒక విధంగా పవన్ ఇమేజ్ కి డేమేజ్ చేస్తోంది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: