తెలుగు చిత్ర సీమలో అప్ కమింగ్ హీరోయిన్లు మంచి జోరుమీదే ఉన్నారు. ముఖ్యంగా రకూల్ ప్రితి సింగ్ ఈ అమ్మడు ఫుల్ జోష్ లో ఉందట. ఎందుకంటే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, రామ్‌ లాంటి యంగ్ హీరోలు తమకు జోడీగా రకూల్ కావాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో రకూల్ కి చేతినిండా సినిమాలే సినిమాలు. వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో కాంపిటీషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే ఈ అమ్మడికి రాశీఖన్నా, రెజీనా,శ్రుతిహాసన్ లాంటి హీరోయిన్లు కాంపిటీషన్ వస్తున్నారు. అయినా కూడా వారిని పక్కకు నెట్టి ముందుకు దూసుకు పోతుంది. వాస్తవానికి రకూల్ మొదట్లో మోడలింగ్ చేసేదట. దీంతో గ్లామర్ పాత్రలకు సరిగ్గా సరిపోతుందని దర్శక, నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారు.


జిమ్ లో ప్రాక్టీస్ చేస్తున్న రకూల్ ప్రితి సింగ్


తాజాగా రకూల్ రాంచరణ్ తో రోమాన్స్ చేయనుందట. రామ్ చ‌రణ్ - శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అందులో ర‌కుల్ క‌థానాయిక‌. ఈ సినిమాలో చ‌ర‌ణ్ ఫైట్ మాస్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ర‌కుల్‌దీ అలాంటి ర‌ఫ్ అండ్ ట‌ఫ్ పాత్రేన‌ట‌. మరి రఫ్ అండ్ టఫ్ అంటే ఫిట్ నెస్ గా ఉండాలి కదా.  అందుకే జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తోందిప్పుడు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్ ప్ర‌పంచంలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: