ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు వ్యాపారాలు అన్నీ కూడా నష్టపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల్లో కరోనా దెబ్బకు ఇప్పుడు  అసలు ఉద్యోగాలు కూడా ఉంటాయో లేదో చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంది అనే మాట వాస్తవం. అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చాలా వరకు కూడా వ్యాపారాలు, ఉద్యోగాలు కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త చర్యల తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలో ఇప్పుడు  అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే కార్యక్రమం కేంద్రం చేస్తున్నట్టే ఇతర దేశాల్లో కూడా చేస్తున్నారు.

అయితే చాలా దేశాల్లో కొన్ని కొన్ని పరిస్థితులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా దేశాల్లో తమ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా దేశాల్లో చాలా వరకు కూడా ఇప్పుడు తమ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన తమ వారికే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలసీనే అన్ని దేశాలు అనుసరిస్తున్నాయి. చాలా దేశాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో స్థానికులను  ఆకట్టుకునే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు.

ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న ఉద్యోగ రంగాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దీని కారణంగా ఎన్నారైలు చుక్కలు చూస్తున్నారు. మన దేశం  నుంచి వెళ్లి స్థిరపడిన చాలా మంది ఇప్పుడు రోడ్డున పడ్డారు. దక్షిణ అమెరికా దేశాల్లో చాలా వరకు కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. దీనితో చాలా మంది ఎన్నారైలు ఇండియా వచ్చేస్తున్నారు. అలాగే ఇతర దేశాల వాళ్ళు కూడా  తమ తమ దేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది అని భావించి ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. మరి ఎంత మంది వచ్చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: