యూరప్ దేశాలు వైద్య రంగంలో ఎంతో  అభివృద్ధి సాధించి... ముందు ఉంటాయి అనే సంగతి తెలిసిందే. యూరప్ దేశాల్లో వైద్య సేవలు ప్రతీ దేశంలో కూడా ఉండాలి అని పలువురు కోరుకుంటూ ఉంటారు. అందుకోసం కొంత మంది అక్కడికి వెళ్లి వైద్య విద్య కూడా అభ్యసించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వైద్య విద్యలో చాలా వరకు కూడా యూరప్ దేశాలే ముందు వరుసలో ఉన్నాయి. ఇక రష్యా కూడా వైద్య విద్య విషయంలో మెరుగ్గానే ఉంది. ఇక ఇప్పుడు  యూరప్ దేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన  వారిని అక్కడే ఉండాలని కోరుతున్నాయి అక్కడి ప్రభుత్వాలు.

లండన్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ఎక్కువగా డాక్టర్ చదివే వాళ్ళు ఉంటారు. మెరుగైన సదుపాయాలు కూడా అక్కడే ఉంటాయి. దీనితో ఇప్పుడు మన దేశం నుంచి వెళ్లి వైద్య విద్య అక్కడ చదివి ఇండియాకు వచ్చేయాలి అని భావించిన వారికి అక్కడి ప్రభుత్వాలు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రభుత్వ వైద్యులుగా కూడా అవకాశాలు ఇవ్వాలి అని భావిస్తున్నాయి. పౌరసత్వం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం రూల్స్ లో మార్పులు కూడా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాయి.

మెరుగైన ప్రతిభ కనబరిచే విద్యార్ధులకు మొదటి ఏడాది నుంచే ఆఫర్లు ప్రకటించడం గమనార్హం. అక్కడి ప్రైవేట్ ఆస్పత్రులు కూడా చాలా వరకు ఇదే పని చేస్తున్నాయి. ఇండియా నుంచి చాలా మంది యూరప్ దేశాలకు వెళ్లి చదువుకుంటారు. వారికి మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. వారిని అక్కడ స్థిరపడే విధంగా కూడా అక్కడి దేశాలు ప్రోత్సహిస్తున్నాయి అంటే ఏ విధంగా అక్కడి పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా కారణంగా కుదేలు అయిపోయిన వైద్య రంగాన్ని నిలబెట్టే ప్రయత్నమో  లేక మరేదైనా కారణమో తెలియదు గాని మన వాళ్లకు మాత్రం చాలా మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: