మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ఇక రావాల్సిన ప్రతిఫలం అదే వస్తుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. కొంతమంది విషయంలో ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఇక తమ పనిలో నిమగ్నమై దేని గురించి ఆలోచించకుండా ముందుకు సాగుతున్న వారు.. ఏదో ఒక సమయంలో అదృష్టం కలిసి వచ్చి ఇక మంచి జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో ఇలాంటిదే జరిగింది. పదేళ్ల కిందటే తండ్రి చనిపోయాడు. అమ్మ బీడీ కార్మికురాలు. ఆమె బీడీలు చుట్టిన డబ్బుతో ఇల్లు గడవడం ఎంతో కష్టంగా మారిపోయింది. చెల్లి, తమ్ముడి బాధ్యత అంతా పెద్ద కొడుకు పైనే పడింది.


 కుటుంబాన్ని పోషించడానికి ఏం చేయాలా అని ఆలోచించాడు. ఈ క్రమంలోనే టాక్సీ డ్రైవర్ గా మారాడు. అయితే కుటుంబ బాధ్యతలు కోసం నాలుగేళ్ల కిందట సదరు యువకుడు దుబాయ్ కి వెళ్ళాడు. ఇక ఇటీవల ఎంతో కష్టపడుతున్న అతని చూసి లక్ష్మీదేవి కటాక్షించింది.  దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు గా మారిపోయారు. ఈ ఘటన బీర్పూర్ మండలంలోని తుంగూరు లో వెలుగు చూసింది. నాలుగేళ్ల క్రితం  దుబాయ్ లో ఓ కంపెనీలో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అజయ్. అయితే అదృష్టాన్ని పరీక్షించుకుందామని రెండు లాటరీలు కొనుగోలు చేశాడు. దీంతో అజయ్ కొనుగోలు చేసిన లాటరీలలో ఒకదానికి 1.5 కోట్ల ధరమ్స్ గెలుపొందింది. దీంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.



కాగా సొంత గ్రామంలో యువజన సంఘాలతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు అజయ్. ఇప్పుడు లాటరీలో గెలుపొందిన డబ్బులతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి కొంత సహాయం చేస్తానని చెప్పాడు. అదే సమయంలో మిగతా డబ్బులతో వ్యాపారం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానంటూ అజయ్ చెప్పుకొచ్చాడు.. ఇలా ఏకంగా పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన అజయ్ కి అనుకొని అదృష్టం వరించింది. ఇక కుటుంబ కష్టాలు మొత్తం తీరిపోయాయి అని చెప్పాలి. ఇక ఇలా మంచి మనసున్న అజయ్ కి లాటరీ తగలడం గురించి తెలిసి మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుందని గ్రామస్తులు కూడా అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: