జగన్ మోహన్ రెడ్డిని ఏదో విధంగా జైలుకి పంపడం తప్ప టీడీపీ నేతలకి మరొక టార్గెట్ లేదు అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఇద్దరు ముగ్గురు టీడీపీ లీడర్ లు ఒకచోట కలిస్తే చాలు ఈ రకమైన డిస్కషన్ కి ఆ చోటు వేదికగా మారుతోంది. ఆఫ్ దీ రికార్డ్ లో ఈ మాటలే వారి నోట్లోంచి వస్తున్నాయి. జగన్ జైలుకి వెళ్ళాలి అంటే ఎలాంటి పరిస్థితి రావాలి, జగన్ జైలుకి వెళ్ళడం తప్పదు కదా అనే విషయాలే వారి మాటల్లో హెడ్డింగ్ లు. జగన్ మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్న మాట వాస్తవమే, విచారణ కూడా జరుగుతోంది.


కోర్టు ఆవరణలో వ్యవహారం సాగుతోంది. చట్టం తనపని తాను చేసుకుని పోతోంది కూడా. కానీ మధ్యలో టీడీపీ నేతల కంగారు ఏంటో అర్ధం కాని పరిస్థితి. మొన్న టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన సీయస్ రమాకాంత్ రెడ్డి జగన్ కి సంబంధించి కూడా ఆ ఇంటర్వ్యూ లో ఒక టాపిక్ మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా జగన్ మీద కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు కింద కేసులు పెట్టారు అన్నట్టు గా ఇన్ డైరెక్ట్ గా ఆయన మాటలు వినిపించాయి. తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశం లో కూడా ఇదే టాపిక్ ని చర్చకి తీసుకుని వచ్చారట కొందరు టీడీపీ నేతలు. జగన్ కి ఎక్కడ శిక్ష పడకుండా తప్పించుకుంటారో అనేది వారి టాపిక్.


వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కేసులు మెయిన్ గా ఉన్నాయి కాబట్టి ఆయన మీద కేసు రుజువు అయినా ఆయన బతికి లేరు కాబట్టి కోర్టు ఆస్తులు జప్తు చేసుకుని మనిషి లేరు కాబట్టి కేసులో వ్యక్తి పేరు కొట్టేస్తుంది.


ఈ విషయం తెలుసుకున్న దేశం నాయకులు కొత్త పల్లవి ఎత్తుతున్నారు. త‌మ‌ని తాము స‌మ‌ర్థించుకోవ‌డం కోసం… ‘జ‌య‌ల‌లిత మ‌ర‌ణించాక శ‌శిక‌ళ‌కు శిక్ష ప‌డింది క‌దా, లాగే వైయ‌స్ లేక‌పోయినా జ‌గ‌న్‌కు జైలు త‌ప్ప‌దు’ అనే క‌న్‌క్లూజ‌న్‌కు దేశం నేత‌లు వ‌చ్చార‌ట‌. జగన్ కేసు వేరు జయలలిత కేసు వేరు అంటున్నారు మరికొందరు. చూద్దాం ఏమి అవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: