సోషల్ మీడియా వచ్చాక మానవ సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని అనుకుంటున్నాం. కానీ.. ఇదే సోషల్ మీడియాను అడ్టుపెట్టుకుని.. ఆయుధంగా మలచుకుని కొందరు దుర్మార్గులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి వాడకం అంతగా తెలియని వారిని టార్గెట్ చేసుకుని.. ప్రముఖుల కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు.
అనంతపురం జిల్లా కదిరిలో ఇలాంటి ఘరానా మోసగాడి ఉదంతం తాజాగా వెలుగుచూసింది. అమడగూరు మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన రమేష్ బాబు సరికొత్త వ్యాపారం అంటూ ప్రజలను మోసం చేసి ఫ్రాంచైజీలు ఇప్పిస్తానని మోసం చేసి వందల మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రముఖులతో దిగిన ఫోటోలను చూపిస్తూ పెద్ద మనిషిగా బిల్డప్ ఇవ్వడంతో చాలా మంది లక్షల్లో మోసపోయారు.
అంతటితో ఆగని సదరు రమేశ్ బాబు.. బోగస్ ఐడీలతో ఫేస్ బుక్ ఖాతాలు నడుపుతున్నాడు. ప్రముఖుల భార్యల ఫేస్ బుక్ ఎకౌంట్లను టార్గెట్ చేసుకుని పరిచయం పెంచుకునేవాడు. వారికి బహుమతులు కూడా పంపి బుట్టలో వేసుకునేవాడు. ఆ తర్వాత వారి గురించి అసభ్యంగా పోస్టులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసేవాడు. వారి నుంచి డబ్బు గుంజేవాడు. ఇప్పుడు అతని పాపం పండి పోలీసులకు చిక్కాడు. విచారణలో ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయో..!?