మావోయిస్టులు  టీడీపీ ఎమ్మెల్యే ను చంపడంతో ఒక్క సారిగా అందరూ ఉలిక్కి పడ్డారు.  'మావోయిస్టుల్ని ఏరివేశాం..' అని ప్రభుత్వాలు ప్రకటించుకుంటున్న ప్రతిసారీ, తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు మారణహోమానికి తెగబడ్తూనే వున్నారు. 'దెబ్బకి దెబ్బ.. ప్రాణానికి ప్రాణం..' అన్నట్టే ఇటు భద్రతా బలగాలకీ, అటు మావోయిస్టులకీ మధ్య యుద్ధం నడుస్తోంది.. పచ్చని అడవులు.. రక్తంతో తడిసిపోతున్నాయి.

Image result for tdp mla shot dead

మిగతా విషయాల్ని పక్కనపెడితే, విశాఖ జిల్లాలో.. అందునా ప్రకృతి అందాలకు, పర్యాటక రంగానికీ పెట్టింది పేరైన అరకులో మావోయిస్టులు పంజా విసరడంతో ఒక్కసారిగా అధికార తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోముని కూడా మావోయిస్టులు అంతమొందించారు.

అరకు.. అధికార పార్టీకి ఇకపై 'వణుకు'.!

బాక్సైట్‌ తవ్వకాల్ని తామే నిషేధించామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటోంటే, తెరవెనుకాల వ్యవహారం మాత్రం ఇంకోలా వుంది. ఆ తెరవెనుకాల బాగోతమే ఇప్పుడు ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రాణాలు తీసేసిందన్నది మెజార్టీ అభిప్రాయం. మావోయిస్టుల ఘాతుకానికి పోలీసులు గట్టి సమాధానం చెప్పడం అన్నది ఎలాగూ జరిగేదే. కానీ, 2019 ఎన్నికల్లో ఈ అరకు ప్రాంతం నుంచి లోక్‌సభకు కావొచ్చు, ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీకి కావొచ్చు.. పోటీ చేయబోయే అభ్యర్థుల పరిస్థితి ఏంటి.? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తోన్న అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి: