నేడు పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టి చదివి వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ఆశలపై  కేంద్ర బడ్జెట్  నీళ్లు చల్లినట్లయ్యింది . తెలంగాణకు మంజూరు చేయాల్సిన నిధులు విషయంలో భారీ కోత విధించింది  కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కేంద్ర బడ్జెట్లో టిఆర్ఎస్ సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవు టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించక పోయినా కనీసం విభజన హామీలను సైతం బడ్జెట్లో నెరవేర్చలేదు అంటూ టీఆర్ఎస్ ఎంపీలు పెదవి విరిచారు. 

 

 

 తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పలు మార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ బడ్జెట్లో కాళేశ్వరం ప్రస్తావనే రాలేదు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తెలంగాణ ఎంపీలు. లక్ష కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధుల సాయం అందుతుందని తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకొన్నదని... కేంద్ర బడ్జెట్లో కనీసం కాలేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదు అంటూ ఆందోళన చెందారు టిఆర్ఎస్ ఎంపీలు. 

 

 

 అంతేకాకుండా గతంలో పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చినప్పటికీ ఈ హామీలను విస్మరిస్తు... రెండు సార్లు  బడ్జెట్ సమావేశాలు ముగిసిన పసుపు బోర్డు ఏర్పాటుకు మాత్రం ఎలాంటి ప్రక్రియ మొదలు కాలేదు అని ఆరోపించారు. ఈ విషయంలో స్థానిక బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి అంటూ టిఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలకి 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని  కేంద్ర ప్రభుత్వానికి నీతి అయోగ్ చెప్పినప్పటికీ కూడా కేంద్రం మాత్రం బడ్జెట్లో నిధులు విడుదల చేయలేదంటూ ఆరోపించారు టిఆర్ఎస్ నేతలు. కేంద్ర బడ్జెట్లో తమపై వివక్ష చూపడం సరికాదంటూ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: