కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఎన్నో రోజుల పాటు పలు రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు  ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తాయి. ఇక తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్ల పైకి చేరి నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు ఎవరు కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. 

 

 

 ఇదిలా ఉంటే అటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తు...తమ  రాష్ట్ర పరిధిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు బీజేపీ ఇతర రాష్ట్రాలు పౌరసత్వ  సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడంతో పాటు తమ రాష్ట్ర పరిధిలో పౌరసత్వ  సవరణ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక స్వరం వినిపించారు. 

 

 

 

 అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పౌరసత్వ సవరణ చట్టానికి సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసినప్పటికీ... వైసీపీ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకించినట్లు అసెంబ్లీ వేదికగా తీర్మానం చేస్తామంటూ చెబుతున్నారు.తాజాగా మరో  ఎమ్మెల్యే ముస్తఫా కీలక ప్రకటన చేశారు. గుంటూరులో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం తీర్మానం చేస్తుందని లేనిపక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటూ సంచలన ప్రకటన చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా జగన్ వ్యవహరించ బోరని నమ్మకం తమకు ఉందని అందరూ ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: