ఏపీలో వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును నేరుగా టార్గెట్ చేసుకోకపోయినా.. ఆయన కోటరీ నాయకులుగా పేరు పొందిన వారి ఆర్థిక మూలాలను కూకటివేళ్లతో సహా పెకలించి టీడీపీని దెబ్బకొట్టేందుకు కేంద్రంతో పాటు ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా అన్ని విధాలుగా ఉచ్చు బిగిస్తోంది. చంద్రబాబు ను నేరుగా ఏమీ చేయకుండానే చుట్టూ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తే తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అప్పుడు ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయవచ్చనేది కేంద్రం ప్లాన్. కొద్ది రోజులుగా ఏపీ లో జరుగుతున్న ఐటీ దాడులకు గమనిస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది.

IHG


 గత ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కి కావలసిన ఆర్థిక వనరులను ఏపీలో టిడిపి అనుకూల వ్యక్తులు కొంతమంది సమకూర్చారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఇంట్లో జరిగిన దాడుల్లో ఈ విషయం తేలింది. కాంగ్రెస్ కోశాధికారి అహ్మద్ పటేల్ కు దాదాపు 400 కోట్ల వరకు టిడిపి అనుబంధ వ్యక్తుల నుంచి సహాయం అందినట్లు గా ఆధారాలు బయటపడ్డాయి. గత రెండు రోజులుగా ఏపీలో కీలక మైన వ్యక్తుల ఇళ్లపై ఐటి సోదాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ కు చెందిన లింగనేని ప్రాపర్టీస్ తో పాటు చైతన్య విద్యా సంస్థలు కూడా ఐటి దాడులకు గురి అయ్యాయి. 

IHG


విజయవాడ గాయత్రి నగర్ లోని లింగనేని ప్రాపర్టీస్ కార్యాలయంతో పాటు రాష్ట్రంలో ఉన్న శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థల క్యాంపస్ లో ఐటీ శాఖ దాడులు నిర్వహించి అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ ముగ్గురు వ్యక్తులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. లింగమనేని రమేష్ తో పాటు, చైతన్య విద్యా సంస్థల అధినేత జీఎస్ రావు, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ వీరంతా టిడిపికి ఆర్థికంగా అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. దీంతో వీరిని కేంద్ర ప్రభుత్వం టార్గెట్  చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

IHG


 ఈ క్రమంలోనే ఐటీ దాడులు జరగడం, టిడిపి నాయకులు భయాందోళనకు గురవ్వడం జరుగుతోంది. ఇంకా ఎంతమంది ఈ విధంగా ఐటి దాడులకు గురి అవుతారు చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు లో ఆందోళన పెంచుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: