రోజులు మారిపోయాయి. కాలం కదిలిపోయింది. అంతా మారింది. అప్పటి రొజుల్లా లేవు నాటి రోజులు. ఎంతో మార్పు వచ్చేసింది. బానిస బ్రతుకు నుండి విముక్తి వచ్చి ప్రపంచంలో స్వేచ్ఛగా బ్రతికే రోజులు ఇవి. భయంతో, కటిక చీకట్లలో స్త్రీ కూరుకునే రోజులు కావివి. ఎంతో మార్పు, ఎన్నో  విజయాలతో  మేము సైతం అంటూ...ఉద్యోగాల్లో మేము సైతం అంటూ, ఏ రంగమైనా సై అంటూ...విద్యతో ముందు అడుగు వేస్తూ..కాలంతో దూసుకెళ్తూ...ఆరితేరి అన్నింట్లో అన్నీ అవరోధిస్తూ... స్త్రీ అబల కాదు సబల. స్త్రీ వెలుగుని చూపే ద్వీపంలా మారిపోయింది.

 

IHG

 

ఎన్నో వజ్రాలపై మరెన్నో ముత్యాలని వాటిపై కనిపించే రూపమే మన మణికర్ణిక. మిలమిల మెరిసే నయనాల్లో అణువణువు ప్రకాశించే ఆ ధైర్యం. ఆ   సాహసానికి జోహార్లు చెప్పక తప్పదు. స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది ఝాన్సీ. ఝాన్సీ కి రాణి గా ప్రసిద్ధి చెందింది మన ఝాన్సీ లక్ష్మీ బాయి. బ్రిటిషు వాళ్ళని ఎదిరించిన ధీశాలి. తిరుగుబాటు చేసిన ముఖ్యమైన వీరుల్లో వీర వనితగా నిలిచింది మన ఝాన్సీ లక్ష్మి. జాన్ ఆఫ్ ఆర్క్ లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక ఎంతో  గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయింది. అంత మహోన్నత కీర్తి సంపాదించింది ఝాన్సీ లక్ష్మీ బాయి తన ధీర ప్రదర్శనతో. 

 

IHG

 

చివరి శ్వాస వరకు కూడ ఝాన్సీ పోరాటం చేసింది. గుర్రంపై ఆమె వెళ్తుంటే శత్రువుల కళ్ళల్లో భయం కనిపించేది. స్త్రీ అయినా సరే ఎంతో మంది ప్రాణాలు తీసింది. యుద్ధాలు చేసి వీరనారై వెలిగింది చరిత్రలో. ఆమె మరణాంతరం గ్వాలియర్లో ఝాన్సీ కంచు విగ్రహం ప్రతిష్టించారు. భారతదేశానికి సేవ చేసిన మొట్టమొదటి స్త్రీ మన ఝాన్సీ లక్ష్మీ బాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: