ఏపీలో జరగబోతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలే అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన టెన్షన్ వాతావరణం ఉందో, అదే రకమైన టెన్షన్ వాతావరణం ఇప్పుడు ఏపీలో నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించడం ద్వారా, తమ పట్టు పెంచుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక అధికార పార్టీలో ఈ ఎన్నికల టెన్షన్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, చిన్నాచితకా నాయకులు ఇలా ఎవరినీ వదిలి పెట్టకుండా అందరిపైనా అధిష్టానం నుంచి తీవ్రస్థాయిలోఒత్తిడి పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తూ... నాయకులకు టార్గెట్లు విదిస్తుంది. అసలు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో  జగన్ ఇంతగా టెన్షన్ ఎందుకు పడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. 

 

IHG


ఇంత గట్టిగా హెచ్చరికలు చేసి ఒత్తిడి పెంచుతూ జగన్ పార్టీ నాయకులపై ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. దీంతో అసలు జగన్ ఇంతగా ఎందుకు టెన్షన్ పడుతున్నాడో ఎవరికీ అర్ధం కావడంలేదు.  అయితే దీని వెనుక కారణాలు చాలానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలు అవుతోంది. ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఎటువంటి ప్రజాబలం లేని పార్టీలు కూడా ఇప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. చిన్న చిన్న విషయాలను కూడా హైలెట్ చేస్తూ, ప్రజల్లో వైసీపీ ప్రభుత్వాన్ని దోషిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 


అదే సమయంలో కేంద్రానికి ఫిర్యాదు కూడా చేస్తున్నాయి. చీటికీ మాటికీ కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తాము అమలు చేసిన పథకాలు, ప్రభుత్వ పాలన గురించి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ? అని తెలుసుకునేందుకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలే మార్గం. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందనేది తేలుతుంది. ప్రస్తుతం జనసేన బిజెపి పొత్తు పెట్టుకున్నాయి. మరోవైపు టిడిపి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వైసీపీకి ఆదరణ తగ్గేలా వ్యవహరిస్తోంది. 


ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలుపొందడం అధికారపార్టీకి కత్తి మీద సామే. అందుకే ఇంతగా ఈ ఎన్నికలపై దృష్టి పెట్టి పార్టీ నాయకులకు జగన్ హెచ్చరికలు చేస్తున్నారు. ఫలితాల్లో తేడాలు వస్తే మంత్రి పదవులు పోతాయంటూ జగన్ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: