నానాటికి కరోనా కేసులు భారత దేశంలో ఎక్కడోకచోట నమోదు అయితేనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరో 8 కేసులు నమోదయ్యాయి. ఈ దెబ్బతో భారత్‌ లో కరోనా బాధితుల సంఖ్య 80 కి చేరింది.  ఇప్పుడు దీని ప్రభావం భర్త ఆరోగ్య శాఖ పై ప్రభావితం కానుంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మహమ్మారిని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. నిజానికి ఈ నెల మొదట్లో మనదేశంలో ఒకే రోజు రెండు కరోనా వైరస్‌ కేసులు పోస్టివ్ అని తేలింది. దీనితో అప్పటి నుంచి మన దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజకి వేగంగా పెరుగుతూ వస్తుంది. కానీ పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పవచ్చు. ఇరాన్‌ దేశంలో ప్రస్తుతం చిక్కుకున్న 44 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. ఇందులో ఏకంగా 21 మంది మహిళలు ఉన్నారు. 

 

 

 

ఇరాన్‌లోని చిక్కుకున్న 100 భారతీయుల రక్త నమూనాలను వారం రోజుల కిందట మహన్ విమానయాన సంస్థకు చెందిన విమానం ఢిల్లీకి తీసుకొచ్చింది. ఈ నమూనాల పరీక్షించి వైరస్ లేదని నిర్ధారణ అయినవారిని భారత్‌కు తీసుకురావాలని నిర్ణయించారు. ఇరాన్ నుంచి వచ్చిన భారతీయులకు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేశారు. ఎయిరిండియా విమానంలో వారిని అక్కడకు తరలించారు. ఈ కేంద్రంలో మొత్తం 120 మంది ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆర్మీ సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటుచేసినట్టు అధికారులు వెల్లడించారు.

 

 

 

ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో సింహభాగం కార్గిల్‌ ప్రాంతానికి చెందిన షియా యాత్రికులే ఉన్నారు. భారత్‌లో చిక్కుకున్న 2,000 మంది ఇరాన్ పౌరులను కూడా వారి దేశానికి తీసుకెళుతున్నారు. ఇరాన్ ఎయిర్, మహన్ ఎయిర్ సంస్థల ఢిల్లీ, ముంబైలకు విమానాలు నడుపుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రకావడంతో ఫిబ్రవరి 25 నుంచి ఇరాన్ నుంచి విమానాల రాకపోకలను భారత్ నిలిపివేసింది. యూపీలో కోవిడ్ కేసులు 11కి చేరడంతో మార్చి 22 వరకు కాలేజీలు, స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేరళలోని పత్తనంథిట్టా జిల్లాల్లో దాదాపు 900 మంది కరోనా అనుమానితులను స్వీయ నిర్బంధంలో ఉంచారు. వారితో సన్నిహితంగా ఎవరు మెలిగారనేది తెలుసుకోడానికి రూట్ మ్యాప్ విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: