కరోనా వైరస్ తీవ్రత గురించి నెత్తి నోరు బాదుకుని చెబుతున్నా జనాల్లో మాత్రం మార్పు అయితే కనిపించడంలేదు. ఇష్టమొచ్చినట్టుగా రోడ్ల మీదకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరు కనబడితే వారిని లాఠీలతో కుళ్ళబొడుస్తున్నా ఏదో ఒకరకంగా రోడ్ల మీదకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒకరి ద్వారా మరొకరికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది అని ఎంత చెబుతున్నా జనాల్లో మాత్రం మార్పు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలు చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లోని జనాలెవ్వరూ లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారని జగన్ దృష్టికి రావడంతో ఈ రోజు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

 

ఈ మేరకు ఆదివారం తెదేపాలోలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ అన్నిశాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. కరోనా విషయంలో ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, నిత్యావసర సరుకులు తెచ్చువలనే కారణం చూపిస్తూ, బయట తిరగడం ఎక్కువైంది. దీంతో ఇకపై పట్టణాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు తెరిచి ఉంచేలా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రజలు కూడా ఆ సమయంలో తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దని విషయాన్ని గట్టిగా ప్రచారం చేయించాలని జగన్ హెచ్చరించారు. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిత్యావసర సరుకులను ఎక్కువ రేట్లకు ఎవరైనా అమ్మితున్నట్టు తెలుస్తే వారిని జైలుకు పంపించాలని సీఎం ఆదేశించారు.

 


 ప్రతీ దుకాణం వద్ద, కూరగాయల షాపు వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు. ఆ ధర కంటే ఎక్కువకు రేట్లకు నిత్యావసరాలు అమ్మితే వెంటనే ప్రజలు కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక మార్కెట్లలో సామాజిక దూరం పాటించే విధంగా అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు అతిక్రమించే వారి విషయంలో కఠినం గా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: